Begin typing your search above and press return to search.
మోడీ అంటే... వెంకయ్య కొత్త నిర్వచనం!
By: Tupaki Desk | 9 Jan 2017 1:47 PM GMTమోడీని పొగిడే విషయంలో బీజేపీ నేతలు, బీజేపీ మిత్రపక్ష అధినేతలు నిత్యం పోటీపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో శృతిమించిన పొగడ్తలు, అతిశయోక్తి తో కూడిన అభినందనలు నిత్యం ఏదో ఒకమూల వినిపిస్తూనే ఉంటాయి. అయితే మోడీని ఆకాశానికెత్తడంలోనూ, పొగడ్తలతో విషయంలో పీక్స్ కి వెళ్లిపోవడంలోనూ బీజేపీ నేతలు ఎంతమంది ఏ స్థాయిలో పోటీపడినా వారంతా సెకండ్ ఫ్రైజ్ కే పోటీపడాలి. ఎందుకంటే... ఈ విషయంలో ప్రథమ బహుమతి ఎప్పుడో వెంకయ్య నాయుడు సొంతమైపోయింది!! రాజకీయ వర్గాల్లో సరదాగా ఈ కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ కామెంట్స్ కి న్యాయం చేస్తూ తాజాగా మరోసారి వెంకయ్య - మోడీపై తనదైన కామెంట్ చేశారు.
విశాఖలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు... అవినీతిపై ప్రధాని మోడీ యుద్ధం ప్రకటించారని - పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది నల్లధనం, అవినీతి నిర్మూలనకే అని అన్నారు. పెద్దనోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చేశాయని తెలిపిన వెంకయ్య.. మోడీ నిర్ణయం పట్ల పారదర్శకత పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని కామెంట్ చేసిన ఆయన... మోడీ అంటే కొత్త నిర్వచనం చెప్పారు. మోడీ అంటే... మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా (MODI: Making Of Developed India" అని తనదైన శైలిలో నిర్వచించారు.
కాగా, విశాఖలో రెండురోజులు పాటు జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ మినిస్టర్స్, ఐటీ కార్యదర్శులతో పాటు 1200మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/