Begin typing your search above and press return to search.
పవర్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మరి..!
By: Tupaki Desk | 20 Aug 2015 10:11 AM GMTచేతిలో అధికారం ఉంటే తాము చాలా శక్తివంతమైన వారిలా భావిస్తుంటారు. నిజానికి అదేమీ తప్పు కాదు. అదంతా అధికారం మహిమ. వంగి.. వంగి దండాలు పెట్టటం దగ్గర నుంచి.. తమను ప్రసన్నం చేసుకోవటం కోసం శక్తివంతమైన పారిశ్రామిక లాబీ దగ్గర నుంచి వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ వినయంగా.. విధేయతతో వ్యవహరిస్తుంటారు.
ఎన్డీయే సర్కారులో కీలకభూమిక పోషిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి రేంజ్ ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని వెంకయ్యే తనకు తాను తాజాగా చెప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిట్ క్యాంపస్ శంకుస్థాపన కోసం వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి ఏ తెలుగువారు వచ్చినా తనను కలిసి వెళుతుంటారని చెప్పుకున్నారు.
మరి.. ఢిల్లీలో ఉన్న మోడీ సర్కారుతోనూ.. కమలనాథులతోనూ ఏపీ నేతల్లో ఎవరికి మాత్రం పెద్ద పరిచయాలు ఉన్నాయి. ఒకవేళ ఉన్నా.. వెంకయ్య మాదిరి ప్రధాని వద్దకు నేరుగా వెళ్లే సత్తా ఉన్న వారు లేరు కదా. అలాంటప్పుడు మన తెలుగోడే కదా అన్న భరోసాతో పాటు.. భోళాగా కనిపించే వెంకయ్య దగ్గరకు వెళ్లకుండా ఎవరి దగ్గరికో ఎందుకు వెళతారు.
అధికారంలో ఉన్నప్పుడు హవా ఎంతలా సాగుతుందంటే.. అప్పట్లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తరచూ ఒక మాట చెబుతుండేవారు. తెలంగాణ జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ కేంద్రంలో జైపాల్‌రెడ్డి ఉన్నారని.. ఆయన శక్తిసామర్థ్యాలు ఎవరి ఊహకు అందవని.. ఆయన తలుచుకుంటే సోనియమ్మ ఆయన మాట జవదాటరని.. ఆయన్ను ఒప్పిస్తామని చెప్పేవారు.
కానీ.. యూపీఏ సర్కారు కథ ముగిసిపోయిన తర్వాత..జైపాల్ రెడ్డిని చూసే వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఎవరి వరకో ఎందుకు.. నాడు ఉద్యమ నేత.. నేడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కనీసం మాట వరసకైనా జైపాల్ రెడ్డి గొప్పతనాన్ని ప్రస్తావిస్తున్నారా? కనీసం ఆయనకు ఒక సన్మానం చేశారా? అధికారంలో ఉన్నప్పటికి.. అది చేజారిన తర్వాతకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందనటానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. మరి.. ఇలాంటి విషయాలు వెంకయ్యకు తెలీనవి కావు. కాకపోతే.. అంతులేని అధికారం చేతిలో ఉన్నప్పుడు తన గురించి తాను కాస్తంత గొప్పలు చెప్పుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. వెంకయ్య కూడా మనలాంటి మామూలు మనిషే కదా. ఆయనకూ చిన్ని చిన్ని ఆశలు ఉండటం తప్పేం కాదు.