Begin typing your search above and press return to search.
ఎన్నిసార్లు మాటమారుస్తావు వెంకయ్యా...?
By: Tupaki Desk | 17 March 2015 1:33 PM GMTఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కర్రవిరగదు.. పాము చావదు అనే చందాన్ని తలపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ నాయకుడు, తెలుగు రాష్ట్రానికే చెందిన కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యవహారశైలి ఇందులో మరింత ఆసక్తికరంగా ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడారు. ఆయన ప్రతిమాటా బీజేపీ పరాయి రాష్ట్ర సభ్యుడిలా ఉంది గాని... ఏపీ మనిషి మాట్లాడుతున్నట్లే లేదు. ఒక సందర్భంలో కట్టుబడి ఉన్నామని, మరో సందర్భంలో అది రాజ్యసభలో హామీయే తప్ప విభజన చట్టంలో లేదని...ఇంకో సందర్భంలో మరో మాట చెప్పి వెంకయ్య మళ్లీ ఈరోజు నాలుక మడతేశారు. తాజాగా పార్లమెంటులో మంగళవారం మరింత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విభజన బిల్లును యూపీఏ ప్రభుత్వం తప్పుల తడకగా రూపొందించిందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంపై విభజన చట్టంలో లేదన్న వెంకయ్య.. రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హామీ మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం తానూ పోరాడానని ఈ మాటలు కాంగ్రెస్ సభ్యులు కూడా చెప్పారని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఈ సభలోనే వ్యతిరేకించారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు నష్టపోతాయన్నారని వెంకయ్య పేర్కొన్నారు. అయితే ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనక్కి వెళ్లేది లేదని మరోమారు స్పష్టం చేశారు.
ముంపు ప్రాంతాల గురించి అప్పటి ప్రభుత్వం కనీసం ఆర్డినెన్స్ ఇవ్వలేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఆ మండలాలను ఏపీలో చేరుస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని వెంకయ్య తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ లేకపోవడంతో గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.250 కోట్లు ఖర్చు చేయలేకపోయారని వివరణ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులను ఆదుకుంటామని, ఆదివాసీల పునరావాసానికి తమ తొలి ప్రాధాన్యత ఉంటుందని వెంకయ్య స్పష్టం చేశారు. ఏపీ రెవెన్యూ లోలోటు భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే చెప్పారని వెంకయ్య అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని...రాజ్యసభ్యులు, ఎమ్మెల్సీల విషయంలో సమస్యలున్నాయని తెలిపారు. ఏపీ రాజ్యసభ సభ్యులు తెలంగాణకు...తెలంగాణ రాజ్యసభ సభ్యులు ఏపీకి వెళ్లారని వెంకయ్య అన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
పనిలో పనిగా తెలంగాణ అంశాన్ని కూడా వెంకయ్య ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గన్నానని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. తెలంగాణాలోనూ వెనుకబడిన జిల్లాలు ఉన్నాయన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
వెంకయ్య నాయుడు ఏపీకీ ప్రత్యేక హోదా విషయంలో పదే పదే ఎందుకు మాటమారుస్తున్నారనే సందేహం వ్యక్తం అవుతోంది. ప్రత్యేక హోదా గురించి ప్రజాప్రతినిధులు మొదలుకొని సామాన్యుల వరకు కేంద్రాన్నే తప్పుగా చూస్తుండటం అనే పరిస్థితి గమనించే ఆయన సానుకూలంగా మాట్లాడుతున్నారా లేక ప్రత్యేక హోదా ఇవ్వలేమని కరాఖండిగా చెప్పలేకపోవడమనే ఇబ్బంది వల్ల ఈ విధంగా చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైన స్పష్టమైన వైఖరితో ఉంటే బావుంటుందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఏపీ ప్రజలు సోషల్ మీడియాలో వెంకయ్యను తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఆ నేపథ్యంలో ''ప్రత్యేకహోదా పరిశీలన''లో ఉంది అని చెప్పిన ఆయన తాజాగా మళ్లీ మాట మార్చేయడంతో ఏపీ ప్రజలు మళ్లీ ఆయనపై మాటల దాడి మొదలుపెట్టేశారు.