Begin typing your search above and press return to search.
అమ్మ టాయ్ లెట్ కాదు.. నమ్మ టాయ్ లట్
By: Tupaki Desk | 2 Oct 2015 9:22 AM GMTఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా అమ్మ పథకాలే. అమ్మ క్యాంటీన్ నుంచి మొదలుకుని అమ్మ లాప్ టాప్ వరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికీ అమ్మ తోక తగిలించడం రివాజయిపోయిుంది. స్వచ్చభారత్ లో పథకాన్ని అమలు పర్యవేక్షణలో భాగంగా తమిళనాడు వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి కూడా ఈ అమ్మ సెగ కాస్త తగిలినట్లుంది.
నమ్మ టాయ్ లెట్ (మన మరుగుదొడ్డి) పథకం ప్రమోషన్ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లిన వెంకయ్యనాయుడు ఈ పథకాన్ని అమ్మ పథకంలో భాగం అనుకుని ఎక్కడ గందరగోళపడతారో అనుకుని ముందే అప్రమత్తమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిదీ అమ్మ పేరుతో పిలవటం అలవాటయిపోయింది కాబట్టి కేంద్రప్రభుత్వం ప్రకటించిన నమ్మ టాయ్ లెట్స్ పథకాన్ని కూడా అమ్మ పథకంగా భావించొద్దంటూ సూచించారు.
అయితే అమ్మ లేకుండా ఏదీ లేదు కాబట్టి ప్రభుత్వ పథకాలకు అమ్మ అని పేరు పెడితే తప్పేం లేదని వెంకయ్య నాయుడు సమర్థించారు కూడా. అమ్మ - నమ్మ పదాల గందరగోళాన్ని ఇలా తనదైన శైలిలో సమర్థించుకున్నారు కేంద్రమంత్రి. అమ్మను మించిన స్వచ్ఛతనం ఏముంది? లోకంలోని అన్ని స్వచ్ఛతలకు మూలం అమ్మే కదా మరి.