Begin typing your search above and press return to search.
ఆయన మీద వెంకయ్య కన్నేశారా?
By: Tupaki Desk | 12 Sep 2016 4:07 AM GMTకేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ఒకవైపు తన మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవడం - వాటిని తిప్పికొట్టడం వంటి పనులతో పాటు, కేంద్రమంత్రిగా ఎడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను చూడడంతోపాటు, అదే సమయంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే కార్యభారాన్ని కూడా భుజానికెత్తుకున్నట్లుగా కనిపిస్తోంది. అసలే హోదా విషయంలో చేసిన మోసానికి ఏపీలో భాజపా దారుణమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉండగా.. వెంకయ్యనాయుడు.. ఇదే సమయంలో పార్టీ ప్రతిష్ట పెంచేలా.. కొత్త నాయకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును భాజపాలోకి ఆకర్షించడానికి వెంకయ్యనాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అనిపిస్తోంది. ఎటూ కేవీపీ వియ్యంకుడు రఘురామరాజు ఇప్పటికే బీజేపీలోనే ఉన్నారు. ఆయన ద్వారా మంతనాలు పూర్తిచేసి.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎటూ సమాధి దశ వచ్చేసింది గనుక.. కేవీపీ భవిష్యత్తు బాగుండాలంటే.. భాజపాలోకి ఆకర్షించాలని వెంకయ్య తలపోస్తున్నారా అనే అనుమానం జనానికి కలుగుతోంది.
ఎందుకంటే... వెంకయ్యనాయుడు తాజాగా కేంద్రం ప్యాకేజీని సమర్థించుకుంటూ.. ఇప్పుడు విమర్శిస్తున్న నాయకులంతా విభజన సమయంలో ఏం చేస్తున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అదే సమయంలో ఆయన ఒక్క కేవీపీ రామచంద్రరావుకు మాత్రం కితాబులు ఇచ్చారు. ఎంపీ కేవీపీ ఒక్కరే తొలినుంచి ఇప్పటిదాకా సమైక్యాంధ్ర వాదనకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
అందరిలాగా చాలా మందికి వేరే గతిలేని పరిస్తితి ఏర్పడింది గానీ.. సమైక్యాంధ్ర వాదనను చాలా మందే వినిపించారు. అయినా ఏమీ ఒరగలేదు. అయితే కాంగ్రెసు నాయకుల్లో కేవీపీని మాత్రం వెంకయ్య బహిరంగంగా పొగుడుతున్నారంటే ఆయన మీద వల వేసి ఉంచినట్లుగా జనం భావిస్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ చట్టంలో పెట్టకపోవడం వల్లనే హోదా రాకుండాపోయిందనే నెపం మీద కాంగ్రెసును వదిలేసి, రాష్ట్ర అభివృద్ధికి మంచి ప్యాకేజీ ఇచ్చింది గనుక.. భాజపా పంచన చేరుతారని జనం ఊహిస్తున్నారు.