Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు.. వెంక‌య్య మాట విన్నారా?

By:  Tupaki Desk   |   5 Sep 2018 7:25 AM GMT
చంద్రుళ్లు.. వెంక‌య్య మాట విన్నారా?
X
ఇప్పుడైతే ఉప రాష్ట్రప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కానీ.. రాజ‌కీయ నేత‌గా వెంక‌య్య‌కు అనుభ‌వం ఎంత‌? ఏళ్ల‌కు ఏళ్లు ఉంది. అలాంటి పెద్ద‌మ‌నిషికి రాజ‌కీయంగా ఉండే ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ తెలీన‌ట్లుగా మాట్లాడ‌టం ఏమీ బాగోలేద‌ని చెబుతున్నారు. ఎంత ఉప‌రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చుంటే మాత్రం.. ఇలా నీతులు చెబితే ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నోళ్లు లేక‌పోలేదు. ఇంత‌కీ వెంక‌య్య ఏం చెప్పారంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికైన స‌భ్యులు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డితే.. వారిపై వ‌చ్చిన ఫిర్యాదుల్ని ఏళ్ల‌కు ఏళ్లు నాన్చ‌కుండా గ‌రిష్ఠంగా మూడు నెల‌ల్లో లెక్క తేల్చేయాల‌ని సూచిస్తున్నారు. అలా చేయ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టంలో మ‌రింత క‌ఠిన రూల్స్ అవ‌స‌ర‌మ‌న్నారు. త‌ప్పులు చేస్తున్న స‌భ్యుల్ని దృష్టిలో పెట్టుకొని రూల్స్ ను తిరిగి రాయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వెంక‌య్య నోట వ‌స్తోంది.

అదేంది వెంక‌య్య సాబ్‌.. మీరేమో పెద్ద కుర్సీలో కూర్చున్నారు. కానీ.. మా ఇద్ద‌రు చంద్రుళ్ల లాంటోళ్ల ప‌రిస్థితి ఏం కావాలె. మ‌స్తు రాజ‌కీయం చేయాల్సిన వేళ‌లో.. ఇలా నీతుల‌తో రూల్స్ పెట్టేస్తే రాజ‌కీయం చేసుడు అవుతుందా? ఏదో చూసీ చూడ‌న‌ట్లు పోవాలె కానీ.. ప్ర‌తి విష‌యానికి హ‌ద్దులు.. స‌రిహ‌ద్దులు గీసుకుంటూ పోతే ఎలా సారూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ‌మే చూడండి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార‌ప‌క్షంగా అవ‌త‌రించిన పార్టీల‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే సీట్ల‌కు.. ఇప్పుడున్న ఎమ్మెల్యే సీట్ల లెక్క చూడండి. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో వారో ప‌వ‌ర్ సెంట్రిక్ గా త‌యార‌య్యారు. ఇదంతా ఎలా సాధ్య‌మంటే.. బేర‌సారాలు.. నైతిక‌త‌ను న‌డి బ‌జార్లో అమ్మ‌కానికి పెట్టి మ‌రీ లాగేసుకోవ‌ట‌మే. ఇప్పుడు రాజ‌కీయ‌మంతా అధికార‌ప‌క్షం గుప్పిట్లో ఉండాలే కానీ.. విప‌క్షం అన్న‌ది ఉండ‌కూడ‌దు. ఇలాంటి మైండ్ సెట్ అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. మీలా నీతులు చెబుతూ.. కొత్త రూల్స్ పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. మా చంద్రుళ్ల లాంటి అధినేత‌ల‌కు ఎంత క‌ష్టం. ఎప్పుడూ మీ కోణ‌మేనా?.. చంద్రుళ్ల మాదిరి అధినేత కోణాల్ని కూడా కాస్త చూడండి సారూ!