Begin typing your search above and press return to search.
పంచ్‌ల వెంకయ్యకే ఆమె పంచ్‌లు పడ్డాయట
By: Tupaki Desk | 12 Dec 2015 10:28 AM GMTవిపక్ష నేతలపై విమర్శలు చేయడంలో పంచ్‌లు, అలాగే వారిపై వ్యంగ్యాస్త్రలు సంధించడంలో ప్రాసలు.. ఇదీ ఆయన మాట తీరు. రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఉంది. ప్రాసలతో కూడిన పంచ్‌లు వేయడంలో రాజకీయాల్లో ఆయనకు మించిన వారు లేరనే చెప్పాలి. ఆయనే కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు. రాజకీయ నాయకులు ప్రజాజీవితానికి పూర్తిగా అంకితమైపోయి.. భార్య, పిల్లల గురించి ఆలోచించడమే పూర్తిగా మరిచిపోతుంటారు. రాష్ట్ర నాయకులైతే ఫర్వాలేదు కానీ కేంద్రమంత్రులకైతే ఇంటికి కూడా వెళ్లలేనంత బిజీబిజీగా గడుపుతుంటారు.
వెంకయ్యనాయుడు అయితే దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. చాలాసార్లు ఆయన కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోని పరిస్థితి ఉందట. ఈ సందర్భంలోనే వెంకయ్య నాయుడి భార్య కూడా ఆయన ఇంటికి రాకపోవడంపై ఓ సందర్భంలో ఆయనపైనే పంచ్‌లు వేశారట. నరసారావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. కన్నతల్లిని, మాతృభాషను,జన్మనిచ్చిన ఊరును మరచినవాడు మనిషే కాదని తాను నమ్ముతానని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
రాజకీయా నాయకుడిగా దేశం మొత్తం తిరగాల్సి రావడంతో పాటు... బాధ్యత ఎక్కువగా ఉండడం అందరికీ న్యాయం చేయడం పెద్ద సమస్యగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. చివరికి భార్య కు కూడా సంతృప్తి కలిగించేలా ఉండలేకపోతున్నానని, అయినా భార్య కాబ్టటి ఆమె సర్దుకుంటున్నారని ఆయన చమత్కరించారు. తన భార్య తన గురించి మాట్లాడుతూ `అప్పడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారని అంటుంటుంద`ని ఆయన నవ్వుతూ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత ఇక్కడికి వస్తే అక్కడికి, అక్కడకు వస్తే ఇక్కడకు రాలేదని అంటున్నారని వెంకయ్య తెలిపారు. పార్లమెంటులో హడావుడి ఉన్నా కోడెల శివప్రసాదరావు కోరిన మీదట నరసరావుపేట వచ్చానని వివరించారు. తనకు నరసరావుపేటతో సంబంధం ఉందని, అనేకసార్లు ఇక్కడ తిరిగినానని అన్నారు.