Begin typing your search above and press return to search.

వైసీసీ ఇంఛార్జీతో స‌ర్పంచ్ భ‌ర్త‌కు ప్రాణ‌హాని!

By:  Tupaki Desk   |   11 March 2022 5:37 AM GMT
వైసీసీ ఇంఛార్జీతో స‌ర్పంచ్ భ‌ర్త‌కు ప్రాణ‌హాని!
X
ఏపీలో అధికార వైసీపీ పార్టీలో వ‌ర్గ విభేదాలు.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు హెచ్చ‌రిల్లుతున్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే కొంత‌మంది కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాలు తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కిందిస్థాయి నేత‌లను వైసీపీ నాయ‌కులు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌నే సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ నుంచి త‌న భ‌ర్త‌కు ప్రాణ‌హాని ఉంద‌ని వైసీపీ స‌ర్పంచ్ బ‌హిరంగంగా వెల్ల‌డించ‌డం క‌ల‌క‌లం రేపింది.

వైసీపీ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీగా బాచిన కృష్ణ చైత‌న్య ఉన్నారు. పార్టీ కోసం ప‌ని చేయాల్సిన ఆయ‌న‌.. కింది స్థాయి నేత‌ల‌ను పీక్కుతింటున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా జె.పంగ‌లూరు మండ‌లం జాగ‌ర్ల‌మూడి వారిపాలెం స‌ర్పంచ్ వెంక‌ట‌ర‌త్నం.. బాచిన కృష్ణ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కృష్ణ చైత‌న్య నుంచి త‌న భ‌ర్త‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆమె ఒంగోలులో విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ వెల్ల‌డించ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని త‌న భ‌ర్త‌ను కృష్ణ చైత‌న్య డిమాండ్ చేసిన‌ట్లు ఆమె తెలిపారు. అయితే త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బులు లేవ‌ని త‌న భ‌ర్త చెప్ప‌డంతో వేధింపుల‌కు గురిచేస్తున్నారని ఆమె వెల్ల‌డించారు.

బెదిరింపుల‌కు దిగుతూ పైశాచిన ఆనందాన్ని పొందుతున్నార‌ని ఆమె ఆవేదన వ్య‌క్తం చేశారు.

2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం పాల‌న‌లో మూడేళ్లు పూర్తి చేసుకునే దిశ‌గా సాగుతోంది. జ‌గ‌న్ పేరుతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ విక్ట‌రీ సాధించిన ఆ పార్టీకి ఇప్పుడు ప‌రిస్థితులు స‌వాలు విసిరేలా మారుతున్నాయి. అభివృద్ధికి నిధులు లేక‌పోవ‌డంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి కూర‌లో క‌రివేపాకులా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పేరుకే ఎమ్మెల్యేలు త‌ప్ప ఏం చేయ‌లేని స్థితిలో ఉన్నార‌ని జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మ‌రోవైపు పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ మీద అసంతృప్తి కూడా ఎక్కువ‌వుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.