Begin typing your search above and press return to search.
తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని అన్న వెంకటరెడ్డి ప్రయత్నాలా?
By: Tupaki Desk | 8 Sep 2022 5:27 AM GMTఅన్నాదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. పార్టీలు, సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ అన్నకు తమ్ముడిపై ప్రేమ ఉన్నా కూడా పార్టీ కోసం కట్టుబడాలి. అందుకే బీజేపీలోకి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మారినా.. తాను కాంగ్రెస్ తరుఫునే ప్రచారం చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫష్టం చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు మాత్రం వెంకటరెడ్డిని డిఫెన్స్ లో పడేస్తున్నాయన్న చర్చ సాగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు చావోరేవో అన్నట్టుగా పోరాడుతున్నాయి. మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పోటీచేసినా పార్టీ మారకుండా కాంగ్రెస్ తరుఫున వెంకట్ రెడ్డి నిలబడ్డాడు. తనకు తమ్ముడితో సంబంధం లేదన్నాడు. ఇదే కోమటిరెడ్డిపై ఇటీవల రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని కొందరు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణలు వెంకటరెడ్డిపై అనుమానాలకు దారితీస్తున్నాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారా? లేదంటే తమ్ముడికే జైకొడుతారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే గెలిపించాలని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే ఫోన్స్ చేస్తున్నారని ఆరోపించారు.
బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఇన్ చార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణరావు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీటీసీ సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు సంచలన ఆరోపణలు చేశారు.
తన తమ్ముడినే గెలిపించాలని.. వెంకటరెడ్డి పదేపదే వాట్సాప్ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. మండలంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఆయన ఫోన్ చేస్తున్నారని.. కానీ బయటకు చెప్పేందుకు వారు ధైర్యంచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి.
ఇక ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరాతీస్తున్నట్టు తెలిసింది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగానే ఫోన్ కాల్స్ చేశారా? అందులో నిజమెంత? అని తేలాల్సి ఉంది.. వెంకటరెడ్డిని వివరణ అడిగేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయినట్టు ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.