Begin typing your search above and press return to search.

చెత్త లారీలో వెంటిలెటర్లు ... అసలు సంగతేమిటంటే ?

By:  Tupaki Desk   |   7 April 2021 7:45 AM GMT
చెత్త లారీలో వెంటిలెటర్లు ... అసలు సంగతేమిటంటే ?
X
దేశంలో కరోనా మహమ్మారి జోరు మళ్లీ మునుపటి రోజులని గుర్తు చేస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో రెండు సార్లు లక్ష కి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో పలు రాష్ట్రాల్లో కరోనా నియమాలని పక్కాగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా కేసులు వెలుగులోకి వస్తున్న మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. . అయితే..అక్కడకక్కడ కొంత నిర్లక్ష్య ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ఉపయోగించే వెంటిలెటర్లను చెత్తను తరలించే వాహనాల్లో తరలించడం తాజాగా వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యకం చేస్తున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.

గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు. సూరత్ మున్సిపాల్టీ నుంచి ఓ చెత్త లారీని తీసుకొచ్చారు. అందులో 34 వెంటిలేటర్లను ఉంచి ఆసుపత్రికి పంపించారు. ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన వెంటిలేటర్లను చెత్త లారీలో తరలిస్తారా , ఇదేనా మీ జాగ్రత్త అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. రోడ్డుపై వెళుతున్న వారు..ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే…గత 24 గంటల్లో 3 వేల 280 కొత్త కేసులు వెలుగు చూశాయి. రెండు వేల 167 మంది డిశ్చార్జ్ అయ్యారు. 17 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 73 వేల 348 యాక్టివ్ కేసులుండగా 171 మంది వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. 70 లక్షల 38 వేల 445 మంది మొదటి కరోనా టీకా తీసుకున్నట్లు, 8 లక్షల 47 వేల 185 మంది రెండో కరోనా టీకా వేయించుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.