Begin typing your search above and press return to search.

చేతులెత్తేసిన వేణుమాధవ్

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:21 PM GMT
చేతులెత్తేసిన వేణుమాధవ్
X
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కమెడియన్ వేణుమాధవ్.. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్లే తన సొంత ఊరైన కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశాడు. కానీ ఆయన వేణు రాజకీయం నామినేషన్ వరకే పరిమితం అయింది.అసలు వేణు మాధవ్ ఎందుకు నామినేషన్ వేశాడో.. ఎందుకు ఉపసంహరించుకున్నాడో ఎవరికీ తెలియడం లేదు. అతను నామినేషన్ అయితే ఉపసంహరించుకోవడం అయితే పక్కా. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభ్యుడిగా ఉన్న వేణు మాధవ్.. ఆ పార్టీ తరఫున టికెట్ ఆశించినట్లు గతంలో వార్తలొచ్చాయి. మరి ఆ పార్టీ తరఫున టికెట్ అడిగాడో లేదో తెలియదు.

కోదాడలో కాంగ్రెస్ పార్టీ అంటే పడని సంప్రదాయ తెలుగుదేశం ఓటు బ్యాంకు తెరాస వైపు మళ్లకుండా ఉండేందుకే చంద్రబాబు వేణుమాధవ్ తో నామినేషన్ వేయించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వేణుమాధవ్ నామినేషన్ వెనక్కు తీసుకోవడంతో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు.నిజానికి వేణుమాధవ్ నామినేషన్ వేయడమే పెద్ద కామెడీగా సాగింది. తొలి రోజు వెళ్లి నామినేషన్ పత్రాలు ఇచ్చాడు. పత్రాలు సరిగా లేకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. తర్వాత మళ్లీ పత్రాలన్నీ సరిగా తీసుకెళ్లి వేణుమాధవ్ నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ ఓకే అయ్యాక ఇప్పుడు ఉపసంహరణతో షాకిచ్చాడు.సినిమాలో కామెడీ వేషాలేసి తెరమరుగైపోయిన వేణు.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కామెడీ చేస్తున్నాడంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.