Begin typing your search above and press return to search.
సారీ...రోజా ఎవరో తెలీదు: వేణుమాధవ్
By: Tupaki Desk | 18 Aug 2017 2:34 PM GMTనంద్యాల ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార - ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నంద్యాలలో తమ అభ్యర్థుల గెలుపు కోసం నంద్యాలలో మకాం వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున హిందూపురం ఎమ్మెల్యే - ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ ప్రచారం చేశారు. శుక్రవారం బ్రహ్మానందరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హాస్యనటుడు వేణుమాధవ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదన్నంత అమాయకంగా వేణుమాధవ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రముఖ సినీ నటి - వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎవరో తనకు తెలియదంటూ మీడియాకు ఆశ్చర్యకరంగా సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ మనసులో బ్రహ్మానంద రెడ్డికే మద్దతివ్వాలని ఉందని తాను అనుకుంటున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. నిత్యం వార్తల్లో నిలిచే వైసీపీ నేత - ప్రముఖ సినీనటి అయిన రోజా తనకు తెలియదంటూ సినీ రంగానికి చెందిన వేణు మాధవ్ వ్యాఖ్యానించడం సర్వత్రా ఆసక్తిని రేపింది. ఆ వ్యాఖ్యలు చేసిన వేణుమాధవ్ కు అసలు పొలిటికల్ నాలెడ్జ్ లేదంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సినీరంగంలో చాలా కాలం నుంచి ఉన్న వేణు మాధవ్ కు ప్రముఖ నటిగా అయినా రోజా తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బ్రహ్మానందరెడ్డి తరపున వేణుమాధవ్ ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే మిమ్మల్ని టీడీపీ రంగంలో దింపిందనే కామెంట్స్ వస్తున్నాయి?’ అన్న ప్రశ్నకు వేణు మాధవ్ ఆసక్తికర జవాబిచ్చారు. ‘ఆమె ఎవరో నాకు తెలియదు.. సారీ’ అని వేణుమాధవ్ సమాధానమిచ్చారు. తన డిగ్రీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర - టీడీపీ ఆఫీసులో పని చేసేవాడినని - టీడీపీతో - నందమూరి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని వేణుమాధవ్ అన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబంతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం కారణంగానే ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు.
ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ స్పందన ఏమిటని వేణుమాధవ్ ను మీడియా ప్రశ్నించింది. ‘కొన్ని కొన్ని విషయాలు పైకి చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయి. పవన్ కల్యాణ్ గారు - ప్రచారానికి రాకపోవచ్చు గానీ, భూమా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలని ఆయన మనసు నిండా ఉందని నా నమ్మకం.. సినీ ఇండస్ట్రీతో భూమా ఫ్యామిలీ కి చాలా అటాచ్ మెంట్ ఉంది. కాబట్టి, వాళ్లు బయటకు చెప్పకపోయినప్పటికీ అంతర్గతంగా చూస్తే వాళ్లందరూ భూమా బ్రహ్మానందరెడ్డికే మద్దతు ఇస్తారు’ అని వేణుమాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి వేణు మాధవ్ కామెంట్స్ విన్న వారు ఆయనకు అసలు పొలిటికల్ నాలెడ్జ్ లేదని, పాపం ఆయనకు ప్రస్తుత రాజకీయ నాయకుల పట్ల ఏమాత్రం అవగాహన లేదని చర్చించుకుంటున్నారు. సినీరంగంలో వేణు మాధవ్ కు రోజా తెలియకపోవడం ఏమిటని పలువురు అభిప్రాయపడుతున్నారు.