Begin typing your search above and press return to search.
లోకేశ్ ఎంట్రీతో టీడీపీకి అరిష్టమట..
By: Tupaki Desk | 15 March 2017 5:52 AM GMTతెర వెనుక పాలిటిక్సు నుంచి తెర ముందుకు వస్తున్న టీడీపీ యువనేత లోకేశ్ జాతకం వల్ల ఆ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. లోకేష్ నామినేషన్ వేసిన రోజే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు - ఇతర కేసుల్లో కోడెల శివప్రసాదరావు - గంటా శ్రీనివాస్ రావుకు నోటీసులు రావడం వంటివన్నీ యాదృచ్ఛికం కాదని.. అంతా లోకేశ్ ఎంట్రీ వల్ల కలుగుతున్న దుష్పరిణామాలని ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చెబుతున్నారు. తాజాగా భూమా నాగిరెడ్డి చనిపోవడం వంటి పరిణామాలన్నీ లోకేష్ గ్రహస్థితి కారణంగానే జరుగుతున్నాయని వేణుస్వామి వివరించారు. లోకేష్ జాతకంలో అష్టమ దశ శని ప్రభావం కొనసాగుతోందని.. ఆయన వల్ల పార్టీకి, నేతలకు చాలా ఇబ్బందులు రానున్నాయని తెలిపారు. కాగా.. మార్చి 29 తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
తెలుగు రాజకీయాల్లో రాబోయే పరిణామాలను ఆయన జ్యోతిష్యం ఆధారంగా వివరించారు. చంద్రబాబు, కేసీఆర్‌ల గ్రహస్థితి ఒకేలా ఉందని చెప్పారు. వారి రాశి కూడా ఒకటేనన్నారు. కాబట్టి వారి గ్రహస్థితుల ఆధారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం వందశాతం ఉందన్నారు. 2019లో ఎన్నికలు వస్తాయన్న భావన నుంచి నాయకులు బయటపడాలన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ల జాతకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 2018లోనే ఎన్నికలు జరగడం మాత్రం ఖాయమని చెబుతున్నారు.
మార్చి 29 తర్వాత తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామాలుంటాయని... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఈ ఉగాది తరువాత నుంచే తమ పని ప్రారంభించాలని ఆయన సూచించారు. 180 ఏళ్ల తర్వాత కుజుడు రాజు స్థానంలోకి వస్తున్నారని ఇలా జరిగినప్పుడు యుద్ధాలు రావడం, పెద్ద నాయకుల మరణాలు, మంత్రులకు సమస్యలు, అధిక మరణాలు వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/