Begin typing your search above and press return to search.
బాంబు పేలుళ్లలో అదే ఉత్కంఠ
By: Tupaki Desk | 27 Aug 2018 1:37 PM GMTజంట పేలుళ్ల కేసులో అదే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో తీర్పు వాయిదా పడింది. సెప్టెంబర్ 4వ తేదీకి నాంపల్లి కోర్టు తీర్పును వాయిదా వేసింది. 2007 అగస్టు 25న సాయంత్రం జరిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందగా - 68 మంది గాయపడ్డారు. మొదట లుంబినీ పార్క్ లో రాత్రి 7.28 నిమిషాలకు జరిగిన పేలుళ్లలో 12 మంది చనిపోయారు. 15 నిమిషాల తేడాల్లో గోకుల్ చాట్ లో జరిగిన పేలుడులో 32 మంది చనిపోయారు. హైదరాబాద్ లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుడుకు పాల్పడ్డ మొదటి సంఘటన ఇదే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగిన జంట పేలుళ్ల(గోకుల్ చాట్ - లుంబినీ పార్క్) కేసులో విచారణ జరిగింది. 11 ఏండ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి రెండవ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు తమ తీర్పును సెప్టెంబర్ 4వ తేదీన వెల్లడించనుంది.
జంట పేలుళ్లతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ రెండు కేసులను మొదట సిట్ అధికారులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైన అక్టోపస్ ఈ కేసు విచారణను నిర్వహించింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టు విచారణను మొత్తం కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టి పూర్తి ఆధారాలు - నిందితుల పాత్రల నిర్ధారణకు సంబంధించిన అంశాలను కోర్టు విచారణలో పొందుపర్చారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుల్లో ఒకరైనా రియాజ్ భత్కల్ - ఇక్బాల్ భత్కల్ - అమీరజాఖాన్ - అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ - అనీక్ షఫీక్ సయ్యిద్ - ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్ - మహ్మద్ సాధిక్ ఇస్రార్ అహ్మద్ - తారీఖ్ అంజూమ్‌లు ఈ కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ - అనీక్ షఫీక్ సయ్యిద్ - ఫారూక్ షర్ఫూద్దీన్ తర్కాష్ - మహ్మద్ సాధిక్ ఇస్రార్ అ హ్మద్ - తారీఖ్ అంజూమ్‌లు అరెస్టు కాగా రియాజ్ భత్కల్ - ఇక్బాల్ భత్కల్ - అమీరజాఖాన్ లు పరారీలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ రియా జ్ భత్కల్ పాకిస్థాన్ - దుబాయ్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు నిఘా - పలు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం అరస్టైన ఐదుగురు ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ ఘటనపై తాజాగా చర్లపల్లి జైలులో నిందితులను న్యాయస్థానం ప్రత్యేకంగా విచారించింది. తుది తీర్పును 4వ తేదీకి వాయిదా వేసింది.