Begin typing your search above and press return to search.
యాహూ ఇంటర్నెట్ ను అమ్మేశారట?
By: Tupaki Desk | 23 July 2016 7:51 AM GMTగూగుల్ - ఫేస్ బుక్ తో పోటీ పడలేక డీలా పడి ఇంటర్నెట్ బిజినెస్ ని అమ్మకానికి పెట్టేందుకు యాహూ రెడీ అయిందా? అనే కథనాలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త.. ఆ విషయాన్ని బలపరుస్తుంది. ఈ వార్తా కథనాల ప్రకారం ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ సంస్థ.. యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కోనుగోలుకు చేసేందుకు అంతాసిద్ధం చేసుకుందట. ప్రారంభం నుంచీ గట్టి పోటీదారుడుగా భావిస్తున్న వెరిజోన్ సంస్థే చివరకి యాహూ ను కైవసం చేసుకోనుందట. అంతా అనుకూలంగా జరిగితే సుమారు 5 బిలియన్ డాలర్లకు (రూ. 33 వేల 575 కోట్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు వెరిజోన్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
అయితే మొత్తం యాహూ ఆస్తులన్నీ వెరిజోన్ దక్కించుకుంటుందా లేక కేవలం కోర్ ఇంటర్నెట్ వ్యాపారానికి సంబందించిన ఆస్తులే ఈ పరిధిలోకి వస్తాయా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. యాహూ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చూస్తే... యాహూ కోర్ ఇంటర్నెట్ వ్యాపారానికి మాత్రమే ఈ ఒప్పందం పరిమితమని, యాహూ రియల్ ఎస్టేట్ - ఇతర ఆస్తులకు సంబందం లేదని తెలుస్తోంది.
యాహూ కొనుగోలు విషయంలో కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టర్స్ - బెర్క్ షైర్ హాత్వే - బైన్ క్యాపిటల్ - ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ - వైపి హోల్డింగ్స్ లు వెరిజోన్ తో పోటీపడిన వాటిలో ప్రముఖమైన సంస్థలు.