Begin typing your search above and press return to search.

మాజీ ఆల్ రౌండర్ వ్యాఖలకు నొచ్చుకున్న వెటరన్ స్పిన్నర్!

By:  Tupaki Desk   |   4 Oct 2020 11:30 AM GMT
మాజీ ఆల్ రౌండర్ వ్యాఖలకు నొచ్చుకున్న వెటరన్ స్పిన్నర్!
X
గత సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే అన్ని జట్లకు భయమేసేది. అందుకు కారణం ఆ జట్టు సాధించే వరుస విజయాలే. ఆ జట్టు కెప్టెన్ ధోనీ తన వ్యూహాలతో, దూకుడు బ్యాటింగ్ తో ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఈ సీజన్లో రైనా, బ్రేవో దూరం కావడంతో జట్టు బలహీన పడింది. దీంతో పాటు ధోనీ ఒకప్పటిలా ఫాంలో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోతున్నాడు. దీంతో జట్టుకు విజయాలు దూరం అయ్యాయి. చెన్నై ఎప్పుడూ లేని విధంగా వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోవడంతో ఇప్పుడు విమర్శకుల దృష్టి ధోనీపై పడింది. అతడికి వయసు అయిపోయిందని, బ్యాటింగ్ లో మునుపటి వాడి తగ్గిందని విమర్శలు చేస్తున్నారు. అయితే ధోనీకి అండగా మాజీ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ నిలిచారు. కొందరికి వయసు ఒక అంకె మాత్రమేనని ట్వీట్ చేశారు. అయితే అదే వయసు మరి కొందరు జట్టులో చోటు కోల్పోవడానికి కారణం కూడా అయ్యిందని పేర్కొన్నారు. అయితే ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ హర్బజన్ సింగ్ కి ఆగ్రహం తెప్పించింది.

హర్బజన్ సింగ్ నాలుగేళ్ళ కిందట చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అలాగని హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించలేదు. దీంతో ఇర్ఫాన్ తనను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడని మండిపోయారు. ఇర్ఫాన్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఇర్ఫాన్ నువ్వు చెప్పిన విషయం కోటి శాతం నిజమని వ్యాఖ్యానించాడు. అయితే హర్బజన్ వ్యాఖ్యల్లో మరో పరమార్థం ఉంది. ఇర్పాన్ పఠాన్ కూడా వయసు మీరే జట్టులో చోటు కోల్పోయాడని హర్భజన్ ఉద్దేశం. అందుకే ఇర్ఫాన్ కు సెటైర్ గా రిప్లై ఇచ్చాడు. తాను దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు ఎంపిక కావడం లేదని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో చెన్నై జట్టు సభ్యుడు అయిన హర్భజన్ ఈ ఏడాది టోర్నీకి కూడా దూరంగా ఉన్నాడు.