Begin typing your search above and press return to search.
అరే.. ఎందిరా బై ఈ వీహెచ్ తాత ఎనర్జీ.?
By: Tupaki Desk | 19 Oct 2019 11:42 AM GMT‘అరే.. ఎందిర బై ఈ వీహెచ్ తాత ఎనర్జీ సూస్తుంటే నాకే సిగ్గనిపిస్తంది.. ముసలోడు అనుకుంటుండా... లేక పడుసోడు అనుకుంటుండా.. గా బండి నడుపుడేంది.. గా ఈలలు.. గోలలు.. అర్జున్ రెడ్డిలా బైక్ షికార్ ఏందిర బై.. ధిమాక్ ఖరాబ్ అయితాంది’ తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు, సీనియర్ నేత వీహెచ్ స్టామినా చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా షాక్ అవుతూ చెబుతున్న మాటలివీ..
తెలంగాణ కాంగ్రెస్ లో వీ హనుమంతరావు అంటే ఓ ప్రత్యేకమైన వ్యక్తి. అచ్చ తెలంగాణ యాసలో ఆయన చేసే విమర్శలు ముచ్చటగొలుపుతాయి. ఏ ప్రజావ్యతిరేక సమస్యపైన అయినా వీహెచ్ ముందుంటారు. వీహెచ్ ప్రభుత్వంపై విరుచుకుపడే తీరు అప్పుడప్పుడూ కాంగ్రెస్ యాక్టివ్ నేతలను కూడా ఆశ్చర్య పరుస్తుంటుంది..
తాజాగా వీహెచ్ తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. టీఎస్ జేఏసీ ఇచ్చిన బంద్ లో పాల్గొన్నారు. ఏకంగా అర్జున్ రెడ్డిలా యమహా ఎఫ్.జెడ్ బైక్ చేతబట్టి బైక్ పై సొంతంగా నడుపుతూ నిరసన ర్యాలీలో వీహెచ్ పాల్గొన్నారు. బైక్ పై కాంగ్రెస్ యువ నేతలతో సమానంగా వీహెచ్ బైక్ నడపడం కాంగ్రెస్ నేతలను, ఆర్టీసీ కార్మికులను షాక్ కు గురిచేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
71ఏళ్ల వయసులోనూ ఇంతలా రెచ్చిపోతున్న వీహెచ్ ను చూసైనా అధికారంలోకి రాలేదని స్తబ్దుగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుద్ది తెచ్చుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు చురకలు అంటిస్తున్నారు. వీహెచ్ ఇంతవయసులో అంత ఎనర్జీతో యాక్టివ్ గా ఉండడం చూసి ‘వీహెచ్ తాతా.. నువ్వు సూపర్ ఎహే’ అంటూ కొనియాడుతున్నారు.