Begin typing your search above and press return to search.
అది ఆడవాళ్లు చేసే పని... రేవంత్ దూకుడుపై కాంగ్రెస్ సీనియర్ సెటైర్
By: Tupaki Desk | 18 Feb 2022 11:12 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా సద్దుమణుగుతున్నాయని రేవంత్‌రెడ్డి భావిస్తున్న సమయంలోనే నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు సైతం అదే రీతిలో తెరమీదకు వస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో కలిసి ఆందోళనల్లో పాల్గొంటున్నప్పటికీ మనస్పర్దలు కొనసాగిస్తూనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డి తాజాగా రేవంత్ రెడ్డితో సఖ్యత కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశం తర్వాత తామిద్దరం పార్టీ కోసం శ్రమించనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ అసంతృప్తి సెట్ చేశాను అని రేవంత్ అనుకునే లోపే మరో సీనియర్ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆయనే మాజీ ఎంపీ వి.హనుమంతరావు.
పీసీసీ రథసారథి రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశాన్ని తనదైన శైలిలో వీహెచ్ విశ్లేషించారు. ఆ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం ఇద్దరూ రెడ్లు కలిసిన సమావేశం అంటూ తేల్చేశారు. ``ఇద్దరు రెడ్లు కలవడం గొప్ప కాదు. వాళ్లు అందరూ చుట్టాలే `అని వ్యాఖ్యానించారు.
దీంతో పాటుగా సీఎం కేసీఆర్ బర్త్ డే రోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టి. కాంగ్రెస్ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడంపై వీహెచ్ హాటు వ్యాఖ్యలు చేశారు.బర్త్ డే రోజు శాపనార్థాలు పెట్టడం సరికాదని హితవు పలికారు. ``మనం శాపాలు పెట్టొద్దు అని నా ఉద్దేశం. శాపనార్థాలు ఆడవాళ్లు పెడతారు`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉండగా, ఇప్పటికే టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం పీసీసీ నిర్వహించిన కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని తనకు పీసీసీ నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయినా జన్మదినం రోజు ఇలా కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల కంటే రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలే కౌంటర్లు ఇస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.