Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి భవిష్యత్తుని తేల్చేసిన వీహెచ్..!
By: Tupaki Desk | 15 Oct 2022 1:30 AM GMTమునుగోడు కేంద్రంగా టీ కాంగ్రెస్ లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు పెద్ద ఝలక్ ఇచ్చారు. ఆయన రాజకీయ భవిష్యత్తుని వీహెచ్ తేల్చేశారు. ఇది పార్టీ లాయలిస్టుకు మరో లాయలిస్టు హెచ్చరిక వంటిదని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ ఆయనకు అనుకూలంగా వ్యవహరించే వీహెచ్ ఈసారి మాత్రం తీవ్ర గరం అయ్యారు.
వైస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి వెంకటరెడ్డికి, హనుమంతరావుకు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వెంకటరెడ్డి మంత్రిగా, వీహెచ్ రాజ్యసభ సభ్యుడిగా కలిసి పనిచేసి పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డారు. కొన్ని సందర్భాల్లో వైస్ కు, వీహెచ్ కు మధ్య మనస్పర్థలు వస్తే కోమటిరెడ్డే దాన్ని సరిదిద్దారని ఇప్పటికీ సీనియర్లు చర్చించుకుంటారు. అంతగా అన్యోన్యంగా మెలిగిన వీరి మధ్య మునుగోడు ఉప ఎన్నిక చిచ్చు పెట్టిందనే చెప్పుకోవచ్చు.
ఇంతకీ జరిగింది ఏందంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంతుపై ఉన్న కోపంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ.., విలేఖరుల సమావేశంలో రేవంత్ రెడ్డి తనను దారుణంగా అవమానించారనే బాధలో ఉన్న వెంకటరెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మునుగోడు తన పార్లమెంటు పరిధిలోకే వస్తున్నా ప్రచారాన్ని లైట్ తీసుకున్నారు.
దీనిపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ అయితే కోమటిరెడ్డి సోదరులను ఏకంగా కోవర్టు బ్రదర్స్ అని తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ కూడా వెంకటరెడ్డిని కోవర్టుగా మిగిలిపోతావని హెచ్చరించాడు.
ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం సరికాదని.. ఈ సమయంలో విదేశాలకు వెళితే శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని.. ప్రచారంలోకి దిగి తమ్ముడిపై యుద్ధం చేయాల్సిందేనని సూచించారు. లేదంటే అందరూ ఆరోపిస్తున్నట్లు నిజంగానే కోవర్టు అనే ముద్ర పడిపోతుందని.. ఇంటి పేరు కూడా మారిపోతుందని కుండబద్ధలు కొట్టారు.
దీంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెసులో తీవ్ర అలజడి చెలరేగింది. ఉన్నట్లుండి వీహెచ్ లో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని సీనియర్లు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఏమైనా చెడిందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు పక్షం రోజులే సమయం ఉన్నందున ఇప్పటికైనా వెంకటరెడ్డి మేలుకొని ప్రచారానికి వెళతారా.. లేదా ఇంటా బయటా ఆరోపణలను నిజం చేస్తారా అనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.