Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు సిద్ధాంతాలు లేవా?
By: Tupaki Desk | 30 Jan 2020 9:21 AM GMTఎవ్వరు ఏమన్నా కానీ మన వీ హనుమంతరావు మాత్రం మనసులో ఉన్నది కక్కేస్తాడబ్బా.. ‘అరే ఏందిర బై ఈ అన్యాయం’ అంటూ తాజాగా సొంత పార్టీ కాంగ్రెస్ నే నిలదీశారు ఈ పెద్దాయన.. పండు ముదసలి వయసులోనూ పడుచోనిలా బుల్లెట్ పై దూసుకెళ్లిన వీహెచ్ రాజకీయాల్లోనూ అంతా ఫైర్ లాంటి మాటల తూటాలు పేల్చుతుంటారు.
తాజా మున్సిపల్ ఎన్నికల్లో మణికొండ సహా పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ను ఓడించడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల నుంచి పక్కకు వెళ్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లి పెద్ద పొరపాటు చేశారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల తమ బద్ధ శత్రువైన బీజేపీ తో పొత్తు పెట్టుకొని తప్పు చేశారని వీహెచ్ సొంత పార్టీనే కడిగి పారేశారు.
గాంధీని చంపిన గాడ్సే వారసత్వ పార్టీ తో ఎలా చేయి కలుపుతారని వీహెచ్ లాజిక్ గా ప్రశ్నించారు. ఒక్క సీటు పోతే పోనివ్వండని.. పార్టీ సిద్ధాంతాలను గంగలో కలుపుతార్రా బై అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.