Begin typing your search above and press return to search.
షర్మిల పార్టీ పైన హనుమంతన్న రియాక్టు అయ్యారుగా
By: Tupaki Desk | 24 Jan 2021 11:50 AM GMTదివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టనున్నారంటూ ఈ రోజు ఒక ప్రముఖ పత్రికలో పెద్ద ఎత్తున కథనం రావటం సంచలనంగా మారింది.రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపటమేకాదు..ఈ అంశం హాట్ టాపి్ గా మారింది. దీనిపై కొందరు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు.
తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని షర్మిల ఏర్పాటు చేసే అంశంపై సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు విముఖతను ప్రదర్శించిన వీహెచ్.. అదేదో ఏపీలోనే ఏర్పాటు చేయాలన్న సూచన చేయటం గమనార్హం. షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుపై వీహెచ్ ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమే. అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లున్నారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడు.
- షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే.. ఏపీలోనే కొత్త పార్టీ పెట్టటం మేలు. తెలంగాణలో పార్టీ పెట్టటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తలెంగాణలో కాంగ్రెస్.. బీజేపీలు ఉన్నాయి. ఏపీలో అయితే జగన్ వ్యతిరేకులు షర్మిల వెంట వస్తారు. జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలి.