Begin typing your search above and press return to search.
కర్ణాటకలో ‘టిప్పు’ మంటలు
By: Tupaki Desk | 11 Nov 2015 4:09 AM GMTప్రశాంతంగా ఉన్న కర్ణాటక ఒక్కసారి భగ్గుమంది. నిరసనలు.. ఆందోళనలు.. పోలీసుల లాఠీఛార్జ్.. రాళ్లదాడులు ఇలా ఒకటి తర్వాత ఒకటి లెక్కన పరిణామాలు జరిగిపోతున్నాయి. అంతకంతకూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్న పరిస్థితి. దీనికంతకూ కారణం అప్పుడెప్పుడో చరిత్రలో కలిసిపోయిన టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని అనుకోవటమే. మొన్నటి వరకూ సాగిన మత అసహనానికి కొనసాగింపుగా ఈ పరిణామాన్ని చూడాలని కొందరు అంటుంటే.. మరికొందరు అందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.
టిప్పు సుల్తాన్ జయంతిని ఇప్పటివరకూ అధికారికంగా నిర్వహించలేదు. కానీ.. అందుకు భిన్నంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి బీజేపీ.. వీహెచ్ పీ లాంటి సంస్థలు వ్యతిరేకించాయి. కానీ.. వీరి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోని కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించటానికి వ్యతిరేకంగా కొడుగు జిల్లా మడికేరిలోని తిమ్మయ్య సర్కిల్ వద్ద జరిగిన ఇరు వర్గాల ఆందోళనతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. ఈ ఆందోళనలో ఒక విశ్వహిందూ పరిషత్ నేత మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వీహెచ్ పీ కొడుగు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఇరువర్గాల ఆందోళనల నేపథ్యంలో మడికేరిలో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. దీనికి సంబంధించిన క్లిప్పింగులు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.
టిప్పు సుల్తాన్ వేడుకల్ని అధికారికంగా నిర్వహించటంపై వీహెచ్ పీ నేతల అభ్యంతరం ఏమిటంటే.. హిందువుల పట్ల విచక్షణగా వ్యవహరించి.. పలువురు హిందువుల్ని ఉచకోత కోసిన వ్యక్తి జయంతిని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు.. ముస్లిం ఓటు బ్యాంకు కోసమే టిప్పు వేడుకల్ని అధికారికంగా నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కొందరు ప్రముఖులు టిప్పు సల్తాన్ వివాదంపై తమదైన శైలిలో స్పందించారు. టిప్పు హిందువే అయి ఉంటే మహారాష్ట్రలో శివాజీకి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండేవి కాదంటూ గిరీష్ కర్నాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గిరీశ్ కర్నాడ్ లాంటి మేధావి వర్గం వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక ప్రముఖుడు ఏ వర్గానికి చెందిన వాడు అన్నది పక్కన పెట్టి.. అతని హయాంలో ఏం జరిగింది? అతడు ఎలాంటి వాడన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ టిప్పు హిందువు అయితే పూజిస్తారన్నట్లుగా మాట్లాడిన కర్నాడ్ లాంటి వారు.. ముస్లిం అయిన షిర్డీ సాయిబాబాను దేవుడిగా హిందువులు ఎందుకు కొలుస్తున్నారు? ఒక వర్గాన్ని దెబ్బ తీసేలా.. వారిపై చెడు అభిప్రాయం కలిగేలా వ్యాఖ్యలు చేయటం ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.