Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతి ఎన్నిక: కేసీఆర్ మద్దతు ఎవరికంటే?

By:  Tupaki Desk   |   5 Aug 2022 8:30 AM GMT
ఉప రాష్ట్రపతి ఎన్నిక: కేసీఆర్ మద్దతు ఎవరికంటే?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ సహా విపక్షాలు బలపరిచిన 'యశ్వంత్ సిన్హా'కే మద్దతు ఇచ్చారు.

ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చి మరీ భారీ ర్యాలీ తీయించి హంగామా చేశారు. బీజేపీతో తొడగట్టారు. యశ్వంత్ సిన్హా ఓడిపోయినా కూడా కేసీఆర్ పంతం వీడలేదు. బీజేపీకి వ్యతిరేకంగానే సాగారు.

తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు (కేకే) ద్వారా ఈ మేరకు కేసీఆర్ ప్రకటన జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం టీఆర్ఎస్ కు చెందిన 16 మంది ఎంపీలు మార్గరెట్ ఆళ్వాకు ఓటు వేయనున్నారు.

పార్లమెంట్ భవనంలో శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఓట్ల లెక్కింపు జరుగనుంది. రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఇక ఏపీకి చెందిన వైసీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేస్తోంది. ఇక బెంగాల్ సీఎం మమత విపక్షాల అభ్యర్థికి మద్దతు పలికారు. బలం ప్రకారం చూస్తే బీజేపీ అభ్యర్థినే గెలుపు ఖాయం. అయినా కూడా టీఆర్ఎస్ ప్రతిపక్షాల వైపే నిలిచింది.