Begin typing your search above and press return to search.

రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి .. రీజన్ ఏంటి

By:  Tupaki Desk   |   11 Aug 2021 10:30 AM GMT
రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి .. రీజన్ ఏంటి
X
దేశంలో గత కొన్ని రోజులుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అత్యంత పటిష్టమైన భద్రత మధ్య పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే , పేరుకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి తప్ప , సభలో కీలక అంశాల పై చర్చలు జరగడం లేదు. సభ ప్రారంభం నుండి వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఆ మధ్యలోనే కేంద్రం కూడా కొన్ని బిల్లుల్ని పాస్ చేయించుకుంటూ ముందుకుసాగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజు వెలుగులోకి వచ్చిన పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేస్తోంది.

అత్యంత పవిత్రమైన సభలో ఎంపీల ప్రవర్తన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. దేవాలయం లాంటి పార్లమెంట్లో ఎంపీ టేబుల్స్‌పైకి నిరసన వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఆయన కంటతడి పెట్టారు. గద్గద స్వరంతో మాట్లాడారు. చేతులు కూడా వణకుతూ కనిపించాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం గానే, ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మంగళవారం సభలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ అనుచిత ప్రవర్తన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం లాంటింది. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. చట్టసభల పవిత్రను దెబ్బతీశారు. టేబుల్‌పై కూర్చున్నారు. మరికొందరు టేబుల్స్‌పై నిలబడ్డారు. పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భ గుడిలో నిరసన తెలిపినట్లే.నిన్నటి పరిణామాలను తలచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణమం. సభలో ఇన్ని రోజుల పాటు కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచిది కాదు అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాజ్యసభలో రచ్చ జరిగింది. రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా కొందరు సభ్యులు వెల్‌ లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లని వస్త్రాలను సభలో ప్రదర్శించారు. రూల్‌ బేక్‌ని చింపేసి గాల్లోకి విసిరేశారు. కొందు ఎంపీలైతే ఛైర్మన్ సీటుకు దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట టేబుళ్లపైకి ఎక్కి నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు అక్కడే బైఠాయించారు. పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడాన్ని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తట్టుకోలేక తీవ్రమైన భాగోద్వేగానికి గురైయ్యారు.