Begin typing your search above and press return to search.
మోడీషాల మాస్టర్ ప్లాన్.. ఉపరాష్ట్రపతిగా గులాం నబీ అజాద్
By: Tupaki Desk | 30 Oct 2021 5:40 AM GMTఊహించని రీతి లో నిర్ణయాలు తీసుకోవటం.. రాజకీయ ప్రత్యర్థుల్ని కోలుకోలని రీతి లో దెబ్బ తీసేలా వ్యూహాలు అమలు చేయటం లో మోడీ షాల తర్వాతే ఎవరైనా. ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ లో నాటి చేవ లేక పోవటం.. బండి నడిపించాల్సిన రాహుల్ తన సత్తా చాటే విషయం లో వేస్తున్న తప్పటడుగులు ఆ పార్టీ కి శాపం గా మారిందని చెప్పాలి. దీనికి తోడు పార్టీ సీనియర్ల కు రాహుల్ టీం కు మధ్య అంతరం విభేదాల కు మరింత ఆజ్యం పోస్తున్న పరిస్థితి. ఇలాంటి సానుకూల వాతావరణం లో మోడీ షాలు వేస్తున్న వ్యూహాత్మక అడుగులు బీజేపీ ని మరో బలోపేతం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆసక్తికర అంశం ఒకటి వెలుగు లోకి వచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ కశ్మీరీ నేత గులాంనబీ అజాద్ ను ఉప రాష్ట్రపతిని చేసేందుకు వీలు గా మోడీ షాలు పావులు కదుపుతున్నారు. అధి కార బీజేపీ ఆయన్ను రాజ్యసభ కు నామినేట్ చేసి.. ఉప రాష్ట్ర పతిగా ఏక గ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలన్న ఆలోచన లో ఉంది. వచ్చే ఏడాది.. రాష్ట్ర పతి.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన కసరత్తును బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే మొదలు పెట్టింది. ఈ రెండు పదవుల కు ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న దాని పై సమాలోచన లో చేస్తోంది.
గతం లో జమ్ము కశ్మీర్ కు ముఖ్య మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న గులాం నబీ అజాద్ ను ఉప రాష్ట్ర పతిని చేయటం ద్వారా.. కశ్మీర్ పై మరింత పట్టు సాధించటం.. ఒక మైనార్టీ నేత కు దేశం లోని అత్యున్నత పదవికి ఎంపిక చేసిన క్రెడిట్ ను సొంతం చేసుకోవాలన్న ఆలోచన లో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో గులాం నబీ అజాద్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా లాభిస్తాయని చెబుతున్నారు. జమ్ము కశ్మీర్ మీద మరింత పట్టుకోసం తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. గులాం నబీ అజాద్ ను ఉప రాష్ట్రపతి గా చేస్తే.. అటు కాంగ్రెస్ ను రెండు ముక్కలు చేయటం లో విజయవంతం కావటమే కాదు.. మెజార్టీ కశ్మీరీల్లో మోడీ షాల పలుకు బడి పెంచుకోవటం తో పాటు.. కశ్మీర్ వ్యాలీ లోని బీజేపీ పట్టు పెంచుకునే వీలు కలుగుతుంది.
ఆ మధ్యన మోడీ పాలన ను గులాం నబీ అజాద్ ఆకాశానికి ఎత్తేయటం తెలిసిందే. అప్పుడే అజాద్ సేవల్ని మోడీ వాడుకుంటారన్న ప్రచారం జరిగింది. తాజాగా ఆ వాదనల కు బలం చేకూరేలా ఉప రాష్ట్రపతి రేసు లోకి అజాద్ పేరు ను తీసుకురావటం చూస్తే.. ఈ నిర్ణయం మొత్తం ఆద్యంతం వ్యూహాత్మక మేనని చెప్పక తప్పదు. మరో వైపు అజాద్ సైతం బీజేపీయేతర పార్టీల నేతల్ని కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయి.. మద్దతు కోరినట్లు గా చెబుతున్నారు. ఏమైనా.. తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ కు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చేలా మోడీ షాలు పావులు కదుపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.