Begin typing your search above and press return to search.
కరోనా బారినపడ్డ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
By: Tupaki Desk | 23 Jan 2022 2:00 PM GMTఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని ఆయన కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న వెంకయ్య నాయుడు ఒక వారం పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి చేసిన ట్వీట్ ప్రకారం, తనతో పరిచయం ఉన్న వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
విశాఖపట్నంలో మూడు రోజుల పోర్టు సిటీ పర్యటన అనంతరం జనవరి 21న వెంకయ్య నాయుడు హైదరాబాద్‌కు వచ్చారు.
వెంకయ్య నాయుడు జనవరి 19న విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో విశాఖపట్నం చేరుకున్నారు. జనవరి 20న ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 73వ వార్షిక జాతీయ సమావేశానికి హాజరయ్యారు. మరుసటి రోజు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ యొక్క మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. అదే రోజు, వెంకయ్య హైదరాబాద్ చేరుకున్నాడు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన బస చేశారు. అంతకుముందు ఆదివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేసులు 10వేలకు తగ్గడం లేదు. తాజాగా 46650 నమూనాలను పరీక్షించగా.. 14440 మందికి కరోనా సోకినట్లు తేలింది.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21,80,634కు చేరింది. ఈ మేరకు వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.