Begin typing your search above and press return to search.
వెంకయ్య డిశ్చార్జీ...అయితే ఒక్క షరతు
By: Tupaki Desk | 21 Oct 2017 12:01 PM GMTఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. గుండె రక్తనాళంలో సమస్య ఉండటంతో నిన్న ఎయిమ్స్ లో చేరిన వెంకయ్యనాయుడుకు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఉందని గుర్తించి...దానిని నివారించటం కోసం వైద్యులు స్టెంట్ వేశారు. తాజాగా ఆయన్ను డిశ్చార్జీ చేశారు. అయితే ఈ సందర్భంగా వైద్యులు షరతు విధించారు.
వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ లో కార్డియో-న్యూరో విభాగంలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు యాంజియోగ్రఫీ పరీక్ష నిర్వహించిన వైద్యులు.. గుండె రక్తనాళాల్లో ఒకటి సంకోచించిందని గుర్తించారు. ఈ సమస్యను సరిదిద్దటానికి స్టెంట్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డాక్టర్ బలరామ్ భార్గవ నేతృత్వంలోని వైద్యుల బృందం వెంకయ్యకు స్టెంట్ ను విజయవంతంగా అమర్చింది. డిశ్చార్జీ చేసిన సందర్భంగా మూడు రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, సందర్శకులను కలుసుకోవద్దని వైద్యులు ఆయనకు సూచించారు.