Begin typing your search above and press return to search.
వెంకయ్య స్తోత్రాలు: గ్లామర్.. గ్రామర్
By: Tupaki Desk | 29 Dec 2019 11:14 AM GMTఉపరాష్ట్రపతి.. తేట తెలుగు వ్యక్తి అయిన మన వెంకయ్య నాయుడికి తెలుగు భాషపై మమకారం.. ఉప్పు కారం రెండూ ఎక్కువేనని ఆయన భాషాభిమానాన్ని చూస్తే అప్పుడప్పుడూ కడుపు నిండిపోతోంది. అందుకే ఏపీలో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంలను ప్రవేశ పెడితే మొదట వ్యతిరేకించింది మన వెంకయ్య కావడం గమనార్హం.
తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మాజీ ముఖ్యమంత్రి స్వీర్గీయ మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పౌరసత్వంపై విధ్వంసకర నిరసనలు సరికాదని హితవు పలికారు.భారత్ కు చెడ్డపేరు తీసుకురావద్దని కోరారు.శాంతియుత నిరసనలు తెలుపాలన్నారు.
రాజకీయ చర్చల్లో పాల్గొనే వారిన చూస్తే వెంకయ్యకు వెటకారం పుడుతోందని చెప్పుకొచ్చారు. రాజకీయ చర్చల్లో పాల్గొనేవారికి గ్లామర్ తోపాటు గ్రామర్ - హాస్యం ఉండాలని వెంకయ్యనాయుడు తనదైన శైలిలో రాజకీయ నేతలపై సెటైర్లు కురిపించారు. మర్రి చెన్నారెడ్డి లాంటి అసాధారణ ప్రతిభాశాలి తీసుకున్న చొరవ - నిర్ణయాలు - విలువలను సభలో ప్రస్తావించి అందరి చేత చప్పట్లు కొట్టించారు.
అసలే తెలుగులో చాలా స్ట్రాంగ్ అయిన వెంకయ్యకు అదే తెలుగు టాపిక్ మర్రి చెన్నారెడ్డి జయంతి పురస్కరించుకొని సభికులకు పాత విషయాలు చెప్పి మరీ తన ప్రసంగంతో సభా మొత్తం దద్దరిల్లేలా చేశారు. మర్రిచెన్నారెడ్డి అవార్డును నీటిపారుదల నిపుణుడు స్వర్గీయ హనుమంతరావుకు ప్రకటించారు. ఆయన కుమారుడికి అందజేశారు.