Begin typing your search above and press return to search.

వెంకయ్య భాషాభిమానం.. అందరికీ ఆశ్చర్యం

By:  Tupaki Desk   |   30 Jun 2019 8:54 AM GMT
వెంకయ్య భాషాభిమానం.. అందరికీ ఆశ్చర్యం
X
తేటతెలుగు సంప్రదాయానికి నిలువెత్త నిదర్శనమైన తెలుగు వ్యక్తి - ఉపరాష్ట్రపతి - సీనియర్ తలపండిన రాజకీయ నాయకుడైన వెంకయ్య నాయుడుకు భాషాభిమానం ఎక్కువ. ఆయన తెలుగు పద్యాలు - గద్యాలు - నవలలు అవలీలగా ప్రసంగంలో వల్లెవేస్తుంటారు. ఇక తెలుగే కాదు.. హిందీ - ఇంగ్లీష్ లలో పార్లమెంట్ లో వెంకయ్య చెప్పే డైలాగులు అద్భుతంగా పేలుతుంటాయి.

స్వతహాగా భాషాభిమాని అయిన వెంకయ్యకు ఈ మూడు భాషలేకాదు.. చాలా ఇతర భారతీయ భాషల్లో కూడా ప్రావీణ్యుడే. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.. తమిళం - కన్నడలోనూ మాట్లాడగల సామర్థ్యం వెంకయ్య సొంతం.

ఇటీవల రాజ్యసభ సమావేశాల సందర్భంగా సభలో అనువాద సేవల గురించి తెలియజేయడానికి ఆయా రాష్ట్రాల ఎంపీలకు 10 భాషల్లో వెంకయ్య నాయుడు మాట్లాడి రాజ్యసభలో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వెంకయ్య భాషాభిమానానికి మచ్చుతునకగా తాజా ట్వీట్ నిలిచింది. హైదరాబాద్ నగరంలోని ఉర్దూ ప్రేమికులను వెంకయ్య ట్వీట్ ఫిదా చేసింది. తాజాగా వెంకయ్య నాయకుడు హైదరాబాద్లోని ముఫాకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రాకను పురస్కరించుకొని ఉర్ధూలో వారికి అర్థమయ్యే భాషలో ట్వీట్ చేశారు. ఆ ఉర్దూ ట్వీట్ వైరల్ అయ్యింది. వెంకయ్యకు ఉర్ధూలో కూడా ప్రావీణ్యం ఉందా అనేలా అనిపించింది. ‘‘ఈ గ్యాడ్యేయేషన్ డేలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు’’ ట్విట్టర్ లో ఉర్ధూలో అభినందనలు తెలిపారు వెంకయ్యనాయుడు. దీంతో ఆ సభా వేదికపై వెంకయ్య భాషాభిమానాన్ని చూసి అందరూ పొగడ్తల వర్షం కురిపించారు.