Begin typing your search above and press return to search.
రేపు రూ.125 నాణెం విడుదల.. త్వరపడండి
By: Tupaki Desk | 28 Jun 2018 12:57 PM ISTమనకు ఒక రూపాయి.. రెండు రూపాయలు - 5 - 10 రూపాయల నాణేలు తెలుసు. కానీ ఇప్పుడు సరికొత్త రూ.125 నాణేం రాబోతోంది. శుక్రవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నాణేన్ని విడుదల చేయనున్నాడు. ప్రముఖ గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణెంను ఉపరాష్ట్రపతి మార్కెట్ లోకి తీసుకొస్తున్నాడు.
బీజేపీ ప్రభుత్వం మహాలనోబిస్ జయంతిని గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక రోజుల కేటగిరిలో జూన్ 29న గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం 2007లో నిర్ణయించింది.
ఈ ఏడాది గణాంకాల దినోత్సవ థీమ్ ‘అధికారిక గణంకాల్లో నాణ్యత హామీ’ అనే విషయంపై ప్రభుత్వం అవగాహన కల్పించేందుకు ఈ నాణేన్ని విడుదల చేస్తోంది. జూన్ 29న కోల్ కతా లో గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్ స్టాటికల్ ఇన్ స్టిట్యూట్ (ఐఎస్ ఐ) - స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఐఎస్ ఐ ను 1931లో మహాలనోబిసే ఏర్పాటు చేయడంతో ఆయన పేరు మీదే తాజాగా కేంద్రం నాణేన్ని విడుదల చేయబోతోంది.