Begin typing your search above and press return to search.
బీజేపీ రూట్ ను ఫాలో అవ్వమని వెంకయ్య సలహా
By: Tupaki Desk | 19 April 2022 1:30 AM GMTఏపీ రాజకీయాలంటేనేనే అలివికాని హామీలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చేవిగా విమర్శలను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల పార్టీలే అంత.. ప్రజలపై ఎన్నికల హామీలు బోలెడు ఇచ్చి వాటిని నెరవేర్చలేక.. ఆర్థికంగా భారం పెంచుకొని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంటాయి. అయితే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం ఇలా ప్రజలపై వరాల వాన కురిపించకుండా వారి ముక్కుపిండి వసూలు చేసే పథకాలనే అమలు చేస్తుంటాయి.
తాజాగా వెంకయ్య నాయుడు ఏపీలో పర్యటిస్తూ పలు హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పార్టీలు, నేతలకు ఒక హిత బోధ చేశారు.ఎన్నికల హామీలపై చురకలంటించారు. ‘రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వాలి’ అని వెంకయ్య సూచించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు.
అయితే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల వేళ ఎన్నో హామీలిచ్చారు.2014లో బీజేపీ నేతగా ఉండి.. కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడు అప్పుడు మోడీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నారు. నాడు ఏపీలో మోడీ పర్యటించినప్పుడు ఇదే వెంకయ్య,మోడీ, చంద్రబాబులు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా సహా ఎన్నో హామీలిచ్చారు. లెక్కలేనన్న హామీలతో ప్రజల చెవుల్లో పూలు పెట్టారు.
కేంద్రంలో బీజేపీని, ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే ఏపీకి 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఇదే వెంకయ్య నాయుడు నాడు ఏపీ సభల్లో పెద్ద పెద్ద హామీలిచ్చారు. ప్రజలు వెంకయ్య కోరినట్టు బీజేపీకి ఓటేసినా.. ఫాపం బీజేపీలో ఉండి వెంకయ్య మాత్రం ఆ మాట నిలబెట్టుకోలేదు.
రాజకీయ నేతలు, హామీల విషయంలో వెంకయ్య ఇప్పుడు నీతి వ్యాఖ్యాలు చేస్తున్నారు. కానీ నాడు ఈయనే ఇచ్చిన ప్రత్యేక హోదా.. ఏపీ విభజన సమస్యలను గాలికొదిలేసిన తీరు చూసి అందరూ దాన్నే ప్రశ్నిస్తున్నారు.
వెంకయ్య ప్రసంగాల్లో ఘనాపాఠి. నోటికి వచ్చింది మాట్లాడొచ్చు. హితబోధ చేయవచ్చు. కానీ ఆ మాట మాట్లాడేతప్పుడు కనీసం ఇదివరకూ మేం ఇచ్చిన హామీలు నెరవేర్చామా? లేదా? అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అప్పుడే ఆ హామీలకు విలువ. ఆయన మాటకు సార్థకత ఉంటుంది.