Begin typing your search above and press return to search.

వైసీపీకి క‌లిసి వ‌స్తున్న కుమ్ములాట‌లు.. తిరుప‌తి ప‌క్కా!

By:  Tupaki Desk   |   27 Nov 2020 5:30 PM GMT
వైసీపీకి క‌లిసి వ‌స్తున్న కుమ్ములాట‌లు.. తిరుప‌తి ప‌క్కా!
X
పిట్ట పోరు.. పిట్ట పోరు.. పిల్లి తీర్చింద‌నే సామెత‌.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో వైసీపీకి.. ఇత‌ర పార్టీల‌కు బాగానే అన్వ‌యం అవుతోంది. ఆది నుంచి ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. 1952 నుంచి మొత్తం 16 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. అత్యంత గ‌రిష్ఠంగా.. 12 సార్లు కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కింది. ఒక‌సారి(1984) టీడీపీ, మ‌రోసారి(1999) బీజేపీ విజ‌యం ద‌క్కించుకున్నాయి. అయితే.. ఈ పార్టీలు ఇక్క‌డ నిల‌దొక్కుకున్న‌ది లేదు. పైగా.. కాంగ్రెస్ కుఉన్న బ‌ల‌మైన ఓటు బ్యాంకు వైసీపీ వైపు మ‌ళ్లిపోయింది. దీంతో గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలూ క‌లిసి.. వైసీపీని టార్గెట్ చేసినా.. ఆ పార్టీనే విజ‌యం సాధించింది.

ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చిం ది. ఈ ఏడాదిన్న‌ర పాల‌న‌లో వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని.. పైగా రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భు త్వ తీరును ప్ర‌జ‌లు త‌ప్పుప‌డుతున్నార‌ని.. విప‌క్షాలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. వాస్త‌వానికి ప్ర‌బుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. జ‌గ‌న్ పాల‌నైనా.. బాబు పాల‌నైనా.. మ‌రెవ‌రైనా.. ఏడాదిన్న‌ర త‌ర్వాత తిరిగి చూసుకుంటే.. కొన్ని లోపాలు, అసంతృప్తులు కామ‌న్. సో.. ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌కు ఇవే రిఫ‌రెండంగా భావించాల‌ని ప్ర‌తిప‌క్షాలు అనుకుంటున్నాయి.

మంచిదే! ఎన్నిక‌ల్లో ఏదో ఒక వ్యూహం తాజాగా వ‌ర్క‌వుట్ కావాల‌నే కోరుకుంటారు. కాబ‌ట్టి.. వైసీపీకి వ్య‌తిరేకంగా పావులు క‌దిపే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. హోరా హోరీ ప్ర‌చారం జ‌ర‌గ‌నుంది. అయితే.. జ‌గ‌న్‌పై దాడి చేస్తున్న పార్టీలు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతున్నాయి. టీడీపీ, జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు.. ఇలా ఎవ‌రికి వారే య‌మునా తీరే.. అన్న‌ట్టుగా సాగుతున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఎవ‌రికివారుగా ఓటేసినా.. ఈ పార్టీల త‌ర‌ఫున నిల‌బ‌డుతున్న అభ్య‌ర్థుల‌కు మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం క‌నిపించడం లేదు. పైగా.. ఎవ‌రు ఏ స్టాండ్ ఎత్తుకుని ప్ర‌చారం చేస్తారు? ప్ర‌జ‌ల్లోకి ఏ విష‌యాన్ని బ‌లంగా తీసుకువెళ్తారు? అనేది కూడా గంద‌ర‌గోళంగా మారింది.

తిరుప‌తిని అభివృద్ధి చేశామ‌ని.. బీజేపీ చెబుతోంది. మ‌రి టీడీపీ ఏం చెప్పాలి? పోనీ.. జ‌న‌సేన అభ్య‌ర్థి ఇక్క‌డ నిల‌బ‌డితే.. బీజేపీ అదే స్టాండ్‌తో ప్ర‌చారం చేస్తుందా? పైగా.. జ‌న‌సేన అభ్య‌ర్థిని నిలబెడితే.. ప్ర‌ధాని లేదా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు వ‌చ్చి ప్ర‌చారం చేస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఒక‌వేళ బీజేపీ అభ్యర్థిని నిల‌బెడితే.. టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతున్న ప‌వ‌న్ వ‌చ్చి ఎలా ప్ర‌చారం చేయ‌గ‌ల‌రు? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఇక‌, కాంగ్రెస్ గ‌ట్టిగా నిల‌బ‌డితే.. ఎడ్జ్ ఉంద‌ని అంటున్నా.. ఆ పార్టీలో నాయ‌కుల‌కు గాఢ నిద్ర‌లో ఉన్నారు. క‌మ్యూనిస్టులు మాట‌కే త‌ప్ప ఓటు కు ప‌నికిరార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇలా విప‌క్షాల అనైక్య‌త వైసీపీకి వ‌రంగా మార‌నుంద‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.