Begin typing your search above and press return to search.

గ్రేట్.. ఒక్క ఊపిరితిత్తితోనే కొవిడ్ పై విజయం!

By:  Tupaki Desk   |   14 May 2021 2:30 AM GMT
గ్రేట్.. ఒక్క ఊపిరితిత్తితోనే కొవిడ్ పై విజయం!
X
కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంది. రెండో దశ ప్రభావంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారూ వైరస్ కాటుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్క ఊపిరితిత్తితోనే కొవిడ్ ను జయించారు ఓ నర్సు. నిజానికి వైరస్ ఎక్కువ ప్రభావం చూపేది ఊపిరితిత్తులపైనే. కానీ 14 రోజుల్లోనే ఆమె విజయవంతంగా కోలుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ప్రపులిత్ పీటర్ వృత్తిరిత్యా నర్సు. ఈమె ఓ ప్రమాదం కారణంగా ఊపిరితిత్తిని పోగొట్టుకున్నారు.

ఒక్క ఊపిరితిత్తితోనే కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న క్రమంలో కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్యులు ఆందోళనకు గురయ్యారు. అసలే ఒక్కఊపిరితిత్తి.. ఆపై ప్రాణంతక వైరస్... తిరిగి జయించగలదా? అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ప్రాణాయామం, యోగాతో కరోనాను జయించి వార్తల్లో నిలిచారు.

కరోనా సోకిన పీటర్ హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇంట్లోని చికిత్స పొందారు. అంతేకాకుండా యోగాపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. మంచి ఆహారం తీసుకుంటూ ప్రాణాయామం చేసినట్లు వెల్లడించారు. ఊపిరితిత్తి సామర్థ్యం కోసం తరుచుగా బెలూన్లు ఊదినట్లు తెలిపారు. అలా 14 రోజుల్లోనే వైరస్ ను జయించానని చెబుతున్నారు. కొవిడ్ నుంచి విముక్తి పొందడానికి మానసిక స్థైర్యం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పారు.

ఒకే ఊపిరితిత్తితో అతి తక్కువ కాలంలోనే కొవిడ్ నుంచి కోలుకున్న పీటర్ ను బంధువులు, వైద్యులు అభినందించారు. ఆమె ధైర్యాన్ని ఎంతో కొనియాడారు. కొవిడ్ యోధురాలిగా ఆమె సేవలు, మానసిక ధైర్యంతో వైరస్ నుంచి కోలుకున్న తీరుని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. పూర్తిగా వైరస్ ను జయించిన ఆమె ప్రస్తుతం కొవిడ్ బాధితులకు సేవలు చేయడానికి మళ్లీ విధుల్లో చేరడం గమనార్హం.