Begin typing your search above and press return to search.

వైరస్ పై విజయం సాధించి తీరుతాం: ప్రధాని మోడీ !

By:  Tupaki Desk   |   11 Jun 2020 10:30 AM GMT
వైరస్ పై విజయం సాధించి తీరుతాం: ప్రధాని మోడీ !
X
ప్రపంచంతో పాటుగా , భారత దేశాన్ని గడగడలాడిస్తోన్న భయంకరమైన ఈ వైరస్ పై పై పోరులో మనం తప్పకుండ విజయం సాధించి తీరుతాం అని ప్రధాని మోదీ ప్రకటించారు. మనకు ఈ ఒక్క సమస్యే కాదని, వరదలు, వడగండ్ల వానలు, రెండు తుపానులు, చిన్న చిన్న భూప్రకంపనలు, చమురు బావుల్లో మంటల వంటి ప్రకృతి వైపరీత్యాలతో కూడా మనం పోరాడుతున్నామని అన్నారు . ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95 వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇండియా స్వావలంబన (ఆత్మ నిర్భర్) కావాల్సిందే అన్నారు.

ఈ వైరస్ అనంతరం.. లోకల్ మాన్యుఫాక్చరింగ్ అన్నదే మన నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మనకు ఉన్న వనరులనన్నీ వినియోగించుకోవలసిన అవకాశం మనకు ఉన్నప్పుడు ఆత్మ నిర్భర దేశం ఎందుకు ఆవిష్కరించదని ప్రశ్నించారు. ఇండస్ట్రీ, రైతులు మమేకం కావాలన్నారు. అలాగే, మన దేశం ప్లాస్టిక్ రహిత దేశం కావాలని సూచించారు. మనం తప్పనిసరిగా దిగుమతి చేసుకునే వస్తువులను మనమే దేశంలో ఉత్పత్తి చేసుకుని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి.. స్వావలంబన లక్ష్యం ఇదే అని మోదీ తెలిపారు.

ప్రజలు- ఈ భూగ్రహం-లాభం.. ఎప్పుడూ కలిసే ఉంటాయి.. వీటిని మనం విడదీయలేం అని ఆయన వ్యాఖ్యానించారు. మనం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలను అవకాశంగా మార్చుకోవాలని, ఇదే టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన కోరారు. ఈ దేశాన్ని ఆత్మ నిర్భర్ దేశంగా మలుచుకునేందుకు ఈ వైరస్ మనకు అవకాశం ఇచ్చిందన్నారు. భారతీయుల దృఢచిత్తం, మన బలమే అన్ని సమస్యలకు పెద్ద పరిష్కారం కాగలదని ప్రధాని మోదీ చెప్పారు.