Begin typing your search above and press return to search.
ఎన్ ఆర్ ఐ ఎమ్మెల్యేకు సోషల్ డిస్టేన్స్ అంటే అర్థం తెలుసా?
By: Tupaki Desk | 27 April 2020 3:50 PM GMTవిడుదల రజినీ.. ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే సేవ పేరుతో చేస్తున్న హంగామా చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చేసేది గోరంత అయితే సోషల్ మీడియాలో కొండంత ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తన సేవా తత్పరతతో ఓవరాక్షన్ తో ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె ప్రచారంతో వెలుగులోకి రావడాన్ని ఎవ్వరూ కాదనరు..కానీ ఆమె అదే పనిగా ఈ లాక్ డౌన్ లోనూ ఆమె చేస్తున్న చేష్టలు కరోనా కారకంగా మారుతున్నాయి.
తాజాగా విడుదల రజినీ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కానీ ఏమాత్రం సోషల్ డిస్టేన్స్ పాటించకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆమె చేసే ప్రయత్నాలు సాయాలు మంచివే అయినా కూడా సామాజిక దూరం పాటించకుండా ప్రజలు అంతా గుమిగూడేలా చేస్తున్నారని అర్థమవుతోంది.
తాజాగా గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే విడుదల రజినీ మాత్రం గుంటూరులో కేసులు పెరుగుతున్నా ఆమె మాత్రం చీమకుట్టినట్టు అయినా స్పందించడం లేదు. ఎమ్మెల్యే పబ్లిసిటీ కోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా తిరిగేస్తూ కరోనా వ్యాపింపచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడుదల రజినీ సీఎం కాబోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సోషల్ మీడియా కోసం కొందరినీ నియమించుకున్నారట.. వారి చేత తాను చేసే కార్యక్రమాలు గోరంత అయితే కొండంతగా ప్రచారం చేసేందుకు ఆ పెయిడ్ అభిమానులు ఉన్నారట.. ఆమె ఏకంగా మంత్రి పదవి కోసం.. లేదా తన పలుకుబడి చూపించుకునేందుకు ఈ విధంగా డబ్బులు ఇచ్చి మరి ప్రచారం చేసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఆమె కాన్సెప్ట్ ఏదైనా సరే తన పబ్లిసిటీ కోసం జనాలను బలిచేయవద్దని.. కరోనా వ్యాపింపచేయవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.