Begin typing your search above and press return to search.

వీడియో : కుక్కలు వెంట పడితే డాన్స్‌ వేసిన యువతి

By:  Tupaki Desk   |   18 July 2021 6:39 AM GMT
వీడియో : కుక్కలు వెంట పడితే డాన్స్‌ వేసిన యువతి
X
మనలో చాలా మందికి కుక్కలంటే విపరీతమైన భయం ఉంటుంది. ఒక వేళ కుక్కులు కరిస్తే... బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందని చాలా మంది భయపడతారు. కానీ కుక్కలను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా కుక్కలను కొంత మంది ద్వేషిస్తే మరి కొంత మంది ప్రేమిస్తారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న సామెత కూడా తెలుగునాట ఉంది. సోషల్ మీడియా వచ్చాక జనాలు చాలా మంది ఎటువంటి పనులు చేసినా తరుచుగా అప్ లోడ్ చేస్తున్నారు. కొన్ని పనులు క్రియేటివిటీతోని కూడుకున్నవయితే, మరికొన్ని పనులు సరదాగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయి.

మన అందరికీ ఎక్కువ మందికి కుక్కలంటే భయం ఉంటుంది. రాత్రి పూట కుక్కులు ఎదురు పడితే ఇక అంతే అన్న విధంగా మనం భయపడిపోతుంటాం. ఎలాగైనా కుక్కల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం. కానీ ఒక్కో సారి వాటికి చిక్కి వాటి చేతిలో కాట్లు వేయించుకుంటాం. అనంతరం వైద్యుడి వద్దకు వెళ్తే అతడు చేసే ట్రీట్ మెంట్ చూస్తే జనాలకు ఏడుపొస్తుంది. అయితే రాత్రిపూట కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి ఏకంగా అందరూ ఆశ్చర్యపడే విధంగా డ్యాన్స్ చేసింది. మరి ఆ యువతి కుక్కలు దాడి చేయకుండా తప్పించుకుందా? లేదా? ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో యువతి రాత్రి పూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇలా ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ యువతికి కుక్కలు కనిపిస్తాయి. దీంతో ఆ యువతి లోలోపల భయపడుతుంది. కానీ పైకి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా వాటి నుంచి తప్పించుకునేందుకు డ్యాన్స్ చేసింది. ఇలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ కుక్కలన్నీ ఆ యవతి చుట్టే కూర్చుని ఉంటాయి. అయినా కానీ యువతి ఏ మాత్రం బెదరకుండా అలాగే డ్యాన్స్ చేయడం కంటిన్యూ చేస్తుంది.

ఇలా ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడాన్ని చూసిన గ్రామ సింహాలు కూడా ఆశ్చర్యంతో ఏమీ చేయకుండా అలాగే చూస్తుండిపోతాయి. జబ్ తక్ హై జాన్ మెయిన్ నాచుంగి అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ... వీడియో ప్లే అవుతుంది. ఈ పాటను తర్వాత యాడ్ చేశారా? లేదా యువతి డ్యాన్స్ చేసేటపుడే ఈ పాట ఉందా అనేది మాత్రం తెలియదు. రాత్ర పూట అదే దారిలో వెళ్తున్న కొందరు వ్యక్తులు యువతి డ్యాన్స్ చేయడాన్ని చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. చూసిన ప్రతి ఒక్క నెటిజన్ రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు. కొంత మంది యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో యువతి మెదడు చాలా చురుగ్గా పని చేసిందని కామెంట్లు పెడుతున్నారు. షేర్లు, కామెంట్లతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.