Begin typing your search above and press return to search.

నెట్ లో వైరల్ గా మారిన ఆ పార్టీ అధ్యక్షుడి సెక్స్ వీడియో..!

By:  Tupaki Desk   |   21 Nov 2019 8:17 AM GMT
నెట్ లో వైరల్ గా మారిన ఆ పార్టీ అధ్యక్షుడి సెక్స్ వీడియో..!
X
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకి సేవ చేయాలనే మంచి లక్ష్యంతో రాజకీయ ప్రవేశం చేస్తారు. కానీ , ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకోవడానికి మాత్రమే రాజకీయాలకి వస్తున్నారు. అందరూ అలాంటివారే అని చెప్పలేదు. ఈ రోజుల్లో కూడా మంచి నాయకులు ఉన్నప్పటికీ ... ఎక్కువ శాతం మంది అడ్డదారులు తొక్కే వారే ఉన్నారు. ఇకపోతే అప్పుడప్పుడు - రాజకీయ నేతల రహస్య భాగోతాలు కూడా బట్టబయలు కావడం మనం చూస్తూనే ఉన్నాం. సమాజం లో పెద్ద మనిషి ముసుగు వేసుకు తిరుగుతూ ఎంతోమంది అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో కొంతమంది ఆడుకుంటున్నారు.

అలాంటి నాయకుల భాగోతాలు ఈ మధ్య చాలానే బయటపడ్డాయి. తాజాగా మరో వృద్ధ నాయకుడి రాసలీలలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయన వయస్సు 63 ఏళ్లు - అలాగే ఒక పార్టీ కి అధ్యక్షుడు ...అంత వయస్సు లో కూడా - ఒక భాద్యత యుతమైన పదవిలో ఉంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ..యంగ్ ఏజ్ లో ఇంకెంత ఎంజాయ్ చెసింటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే వరుసగా బీజేపీ కి చెందిన నేతల భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో టెంక్షన్ మొదలైంది. తన సెక్స్ వీడియో వైరల్ కావడంతో బీజేపీ డామన్ - డయ్యూ అధ్యక్ష పదవికి 63 ఏళ్ల గోపాల్ టండెల్ రాజీనామా చేశారు.

పూర్తి వివరాలు చూస్తే.. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం అయిన డామన్ డయ్యూ బీజేపీ అధ్యక్షుడిగా గోపాల్ టండల్ పని చేస్తున్నారు. గోపాల్ టండెల్ ప్రస్తుత బీజేపీ ఎంపీ. గతంలో కాంగ్రెస్ - ఎన్సీపీలలో చురుకుగా పని చేసిన గోపాల్ టండెల్ తరువాత ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. డమాన్ డయ్యూలో గోపాల్ టండెల్ బీజేపీ సీనియర్ నేత. బీజేపీ ఎంపీగా ఉన్న 63 ఏళ్ల గోపాల్ టండెల్ ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్థిస్తూ - రాసలీలలు సాగిస్తున్న ఓ వీడియో విడుదల కావడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనితో గోపాల్ టండెల్ తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంపించారు.

అయితే , రాజీనామా అనంతరం ఈ వీడియో పై స్పందిస్తూ .. నేను ఏ మహిళతో రాసలీలు సాగించలేదని - కావాలనే తన సొంత పార్టీ లోని కొందరు నాయకులు ఇలా తనను ఇరికించి తన పరువు తియ్యడానికి ప్రయత్నించారని, ఆ వీడియో నకిలీ అని బీజేపీ నాయకుడు గోపాల్ టండెల్ ఆరోపించారు. తన పరువు తీసిన వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలని - నకిలీ వైరల్ వీడియో తయారు చేసిన వారిని శిక్షించాలని గోపాల్ టండెల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ - ఆ వీడియో లో ఉన్నది బీజేపీ అధ్యక్షుడు గోపాల్ టండెల్ అని కొందరు బీజేపీ నేతలే చెప్పడం గమనార్హం.