Begin typing your search above and press return to search.

నలుగురు అమ్మాయిలు.. ఇంత దారుణమా? ఇలాంటి వీడియోను చూసి ఉండరు

By:  Tupaki Desk   |   15 Jun 2022 5:30 AM GMT
నలుగురు అమ్మాయిలు.. ఇంత దారుణమా? ఇలాంటి వీడియోను చూసి ఉండరు
X
అవును.. ఈ వీడియోలాంటిది ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు. పదహారు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అమ్మాయిలు ఇంత దారుణంగా వ్యవహరించటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఒక అమ్మాయిని నలుగురు అమ్మాయిలు నడి రోడ్డు మీద ఇష్టారాజ్యంగా కొట్టటం.. తీవ్రంగా గాయపర్చటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎందుకిలా జరిగింది? అసలేమైంది? ఇంత జరుగుతున్నా.. ఎవరు ఎందుకు అడ్డుకోలేదు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇండోర్ లోని ద్వారకాపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుందని చెబుతున్నారు.

ఈ వీడియోలో గాయపడిన నందినీ యాదవ్ అనే అమ్మాయి డోమినోస్ డెలివరీ గర్ల్ గా పని చేస్తోంది. డెలివరీ కోసం వెళుతున్న ఆమెను.. నలుగురు అమ్మాయిలు అడ్డుకోవటం.. విచక్షణ రహితంగా దాడికి పాల్పడటం సంచలనమైంది.

అయితే.. ఆమెపై దాడి చేసే సమయంలో సదరు అమ్మాయిల ఆరోపణ ఏమంటే.. దెబ్బలు తిన్న అమ్మాయి చాడీలు చెబుతుందని.. అందుకే ఆమెకు గుణపాఠం చెబుతున్నట్లుగా దాడి చేసిన వారు చెబుతున్నారు.

అయితే.. అమ్మాయిల కోపాన్ని చూసిన స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోవటం గమనార్హం. మాంచి కోపం మీద ఉన్న వారు.. అడ్డుకుంటే ఎలా రియాక్టు అవుతారన్న సందేహంతోనే ఎవరూ ముందుకు రాలేదంటున్నారు. అయితే.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో కెమేరాను ఆన్ చేసి.. వారి ఇష్టారాజ్యాన్ని కెమేరాల బంధించారు.

తనపై దాడి అనంతరం.. పోలీసుల్ని ఆశ్రయించింది బాధిత మహిళ. ఆమెపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఆధారంగా కర్రతో దాడి చేసిన వారిని గుర్తించే పనిలో బిజీ అయ్యారు స్థానిక పోలీసులు. ప్రధాన నిందితురాలి పేరు పింకీగా పోలీసులు చెబుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటే కానీ.. వారంతలా రియాక్టు కారణం ఏమిటన్న అంశంపై ఉన్న మిస్టరీ వీడే వీలుందని చెప్పక తప్పదు.