Begin typing your search above and press return to search.
రాష్ట్రం తర్వాత సొంత నియోజకవర్గంలో ఇవేం రోడ్లు కేసీఆర్?
By: Tupaki Desk | 9 Aug 2022 4:19 AM GMTతానేం చెప్పినా నడిచిపోయే రోజులు పోయిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారా? లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు చాలామంది నోటి నుంచి వస్తోంది. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే.. గులాబీ బాస్ కేసీఆర్ ను విమర్శించేందుకు తోపు నేతలు సైతం తెగ భయపడేవారు. కేసీఆర్ ను మాట మాత్రం అన్నంతనే.. తెలంగాణను అన్నట్లే ప్రజలు ఫీల్ అవుతారన్న ఆందోళనతో నోరు తెరచి ఒక మాట అనేందుకు తెగ జంకేవారు.
అంతటి రాజభోగాన్ని అనుభవించిన కేసీఆర్.. గడిచిన కొంతకాలంగా తన ఇమేజ్ విషయంలో చాలానే తేడా వచ్చేసిందన్న వాస్తవాన్ని ఆయన వెంటనే గుర్తిస్తే మంచిదంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన్ను ఉద్దేశించి ఎంతటి తీవ్రమైన మాటనైనా సరే.. ఇట్టే అనేసే కొత్త ధోరణి మొదలైంది.
కేసీఆర్ తప్పుల మీద బోలెడన్ని విమర్శలు ఒక పక్క ఉంటే.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే కామెంట్లు బోలెడన్ని వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్ లోనూ.. వాట్సాప్ లలో కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి.
తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు కానీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారులు ఎలా ఉన్నాయన్న దానిపై ఫోకస్ చేస్తూ ఒక చిట్టి వీడియో బయటకు వచ్చింది.
అందులో దారుణమైన రోడ్లు దర్శనమివ్వటంతో పాటు.. ఒక గోతిలో ఆర్టీసీ బస్సు దిగబడిపోయి.. ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇదంతా చూస్తే.. తిరుగులేని అధినేతగా దర్శనమిచ్చే కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రోడ్లు ఇంత దారుణంగా ఉండటమా? అని విస్మయానికి గురవుతున్నారు. రాష్ట్రాన్ని పక్కన పెట్టి.. సొంత నియోజకవర్గంలో అయినా చక్కటి రోడ్లు ఎప్పటికి వస్తాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా విడుదలైన ఈ వీడియో చూసినోళ్లు.. కేసీఆర్ పాలనతో ఆయన సొంత నియోజకవర్గం రోడ్లు ఎంత సోకుగా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. విడి రోజుల్లో అయితే ఫర్లేదు కానీ.. ఇప్పుడు తమ పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసేలా ఉన్న వీడియోతో పెద్ద ఇబ్బందేనని చెబుతున్నారు. దీనికి తోడు.. మునుగోడు ఉప ఎన్నిక వచ్చేస్తున్న వేళలో.. సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలోని పరిస్థితుల వీడియో తెలంగాణ అధికార పక్షాన్ని దెబ్బ తీసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.