Begin typing your search above and press return to search.
శశికళ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
By: Tupaki Desk | 7 Feb 2017 8:21 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు రెడీ అవుతున్న శశికళ నటరాజన్ పట్ల జనం తీవ్ర వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. నెటిజన్లయితే... ఒక సర్వెంట్ సీఎం సీట్లో కూర్చునేందుకు అంగీకరింబచోమని అంటున్నారు. తమిళులు అంతమాట అంటున్నారెందుకు... ఇంతకీ శశికళ బ్యాక్ గ్రౌండేంటి అన్నది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు బోధపడతాయి. అయితే.. దశాబ్దాల కిందట ఆమె ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పటి నుంచి ఆమె గురించి తెలిసినవారు ఇప్పుడు నోరు విప్పడానికి ఇష్టపడడం లేదు. శశకళకున్న శక్తి గురించి తెలిసి ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ తమనేమీ అడగొద్దంటున్నారు.
చెన్నైలోని అళ్వార్ పేట్ కాలనీలో భీమన్న గార్డెన్ వీధిలోకి వెళ్తే అక్కడ ఒక చిన్న టీ దుకాణం కనిపిస్తుంది. సన్నని రోడ్డులో ఉన్న ఈ పాతబడిన దుకాణం ఇప్పుడు టీషాపే కానీ ఒకప్పుడు ఇది శశికళ నడిపించిన వీడియో దుకాణం. అప్పట్లోల దానిపేరు వినోద్ వీడియో సెంటర్. 1980ల్లో ఈ అద్దె షాపులో ఆమె వీడియో సెంటర్ నిర్వహించేవారు. దుకాణానికి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని అందులో ఆమె కాపురం ఉండేవారు. జయలలితతో పరిచయం తరువాత ఆమె స్టార్ తిరిగిపోయింది. ఓ ఐఏఎస్ అధికారి అండతో శశికళ.. జయ రాజకీయ ప్రోగ్రాంలను వీడియో తీసే పని సంపాదించారు. ఆ తరువాత మెల్లమెల్లగా జయకు చేరువయ్యారు. ఆ స్నేహం మరింత పెరిగి శశికళను విడిచి ఉండలేనంతగా జయ మారిపోయారు. దీంతో శశికళ వీడియో షాప్ మూసివేసి ఇక్కడి నుంచి ఏకంగా జయ నివాసం పోయెస్ గార్డెన్ కు మకాం మార్చేశారు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే.
అయితే.. శశికళ దుకాణం ఉండే వీధి, ఆ ప్రాంతంలో మొదటి నుంచి ఉన్నవారెవరూ ఆమె గురించి చెప్పేందుకు పెద్దగా ఇష్టపడడం లేదట. కొందరు మాత్రం అప్పటి ఆమె జీవితం గురించి గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో శశికళ రిక్షాలో దుకాణానికి వచ్చేవారని.. జయలలిత ఆమె కోసం నల్ల అంబాసిడర్ లో వచ్చేవారని గుర్తు చేసుకుంటున్నారు. శశికళ చాలా మంచి వ్యక్తని.. స్నేహశీలి అని చాలామంది చెబుతున్నారు. అయితే.. ఇతర వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎందుకో మౌనంగా ఉంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/