Begin typing your search above and press return to search.

దొంగ చీమ.. ఎంత విలువైన పనిచేసింది..

By:  Tupaki Desk   |   12 Aug 2018 6:17 AM GMT
దొంగ చీమ.. ఎంత విలువైన పనిచేసింది..
X

దాదాపు 60కిలోలు ఉండే మనిషి తనంత బరువును మాత్రమే మోయగలడు.. కొందరు బలవంతులు 100 కిలోల వరకూ లాగేయగలరు.. ఇది మనుషుల లెక్క. కానీ చిన్ని చీమల లెక్క మాత్రం వేరే ఉంది.. అవి తమ శరీర బరువు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ బరువైన వస్తువులను ఈజీగా లాగేయగలవు. చీమల బలం, నైపుణ్యం తెలియాలంటే వాటి పుట్టలను, ఆహార సామర్థ్యాన్ని చూడాల్సిందే.. ఆహారాన్ని అవి తరలించుకుపోయే తీరు.. పెద్ద వస్తువులను కూడా లాక్కుపోయే సామర్థ్యాన్ని మనం చిన్నప్పుడు గ్రామాల్లో చూస్తుంటాం. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఓ చిన్న చీమ.. ఓ 10 లక్షల విలువైన వజ్రాన్ని చూసి దాన్ని తినుబండారం అనుకున్నట్టు ఉంది. వజ్రాలున్న ఓ చిన్న సంచిలోంచి ఓ వజ్రాన్ని తీసి ఆ చీమ అతి కష్టం మీద మోసుకుపోతూ కనిపించింది. ఈ దృశ్యాలు అక్కడున్న కెమెరాలో నిక్షిప్తం కావడంతో ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీమల గొప్పతనం ఏంటో అర్థమైంది. 10 లక్షల విలువైన వజ్రాన్ని తీసుకుపోతున్న చిన్న చీమ అంటూ తెగ షేర్లు చేస్తూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.