Begin typing your search above and press return to search.
సునామీ విలయం ఎంతో చెప్పిన చిట్టి వీడియో!
By: Tupaki Desk | 6 Oct 2018 7:01 AM GMTప్రకృతి విలయాన్ని మాటల్లో చెప్పగలమే తప్పించి.. కళ్లకు కట్టినట్లుగా చెప్పటం సాధ్యం కాదు. విలయం విరుచుకుపడిన వేళ.. వీడియో షూట్ సాధ్యం కాదు. కానీ.. ఒక సీసీ కెమేరా పుణ్యమా అని తాజాగా ప్రకృతి విలయం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం ప్రపంచానికి తెలిసేలా చేసింది.
మూడక్షరాల సునామీ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో ఇటీవల ఇండోనేషియాలో విరుచుకుపడిన ప్రకృతి విపత్తు చెప్పేసింది. భారీ భూకంపం.. ఆ వెంటనే విరుచుకుపడిన సునామీతో ఇండోనేషియాలోని సులవేసి దీవిలోని సాలూ నగరం అతలాకుతలమైంది. ఇప్పటి వరకూ అధికారికంగా 1570 మందికి పైనే మరణించినట్లుగా చెబుతున్నారు. అనధికారికంగా మాత్రం మరిన్ని మరణాలు చోటు చేసుకొని ఉంటాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఒక చిట్టి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండోనేషియాలో విరుచుకుపడిన సునామీ తీవ్రతను కళ్లకు కట్టేలా ఒక సీసీ కెమేరా ఫుటేజ్ బయటకు వచ్చింది. మహోగ్ర రూపంలో విరుచుకుపడిన ఆలల తాకిడికి పెద్ద పెద్ద చెట్లు.. ఇళ్లు.. కలిసి వేగంగా కొట్టుకొచ్చిన వైనం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇప్పటివరకూ ప్రకృతి విలయాన్ని చూపించే హాలీవుడ్ సినిమాలు ఎన్నో వచ్చినా.. తాజా చిట్టి వీడియో ముందు అవన్నీ బలాదూరేనని చెప్పాలి.
రీల్ కు.. రియల్ కు మధ్యనున్న తేడా ఈ చిట్టి వీడియోను చూస్తే ఇట్టే అర్థమైపోవటం ఖాయం. అప్పటివరకూ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద వెళ్లే వాహనాలు.. ముంచుకొస్తున్న ముప్పును గుర్తించి వేగంగా వెనక్కి వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఊహించని రీతిలో వరద వెల్లువెత్తిన వైనం చూస్తే.. నోట మాట రాదంతే. ఈ భయానక వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటి రవీనాటాండన్ రీట్వీట్ చేశారు. 52 సెకన్లు ఉన్న ఈ చిట్టి వీడియో చూస్తే.. ప్రకృతి విలయం అన్న పదం ఎంత భయంకరంగా ఉంటుందో ఇట్టే అర్థం కాక మానదు.