Begin typing your search above and press return to search.

గుంటూరులో వైసీపీ మంత్రి వ‌ర్సెస్ టీడీపీ మాజీ మంత్రి... ఢీ అంటే ఢీ...!

By:  Tupaki Desk   |   6 Aug 2022 4:18 AM GMT
గుంటూరులో వైసీపీ మంత్రి వ‌ర్సెస్ టీడీపీ మాజీ మంత్రి... ఢీ అంటే ఢీ...!
X
రాష్ట్ర‌వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య తీవ్ర‌మైన యుద్ధం జ‌రుగుతుంద‌నేది అంద‌రికీ తెలిసిందే.

అయితే..కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఈ ఫైట్ మ‌రింత భ‌యంక‌రంగా ఉంటుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ల్నాడు జిల్లాలోని చిల‌క‌లూరిపేట ముందు వ‌రుస‌లో నిలిచింద‌ని చెబుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు.

గ‌తంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. కుప్పం, పులివెందుల‌పైనే ఎక్కువ‌గా దృష్టి ఉండేది. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ముఖ్యంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా దృష్టి సారించారు. వీటిలో ఒక‌టి రాప్తాడు. రెండు.. భీమ‌వ‌రం, మూడు గాజువాక‌. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు గెలుస్తారా? అని .. పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా క‌ట్టారు. భీమ‌వ‌రం, గాజువాక‌ల్లో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రాప్తాడులో ప‌రిటాల శ్రీరాం పై చాలా మంది బెట్టింగులు క‌ట్టారు.

ఇప్పుడు.. ఇదే ప‌రిస్థితి చిల‌క‌లూరిపేట‌పైనా ఉంటుంద‌నేది స్థానిక నేత‌ల టాక్‌. ఇక్క‌డ టీడీపీ నుంచి మ‌రోసారి ప్ర‌త్తిపాటి పుల్లారావు, వైసీపీ నుంచి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీలు పోటీచేయ‌నున్నారు. ఇద్ద‌రూకూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. మంత్రిగా ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ..నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్రం ఆమె విడిచి పెట్ట‌కుండా.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎవ‌రు వ‌చ్చినా.. వారి స‌మ‌స్య‌లు వింటున్నారు.

అదే స‌మ‌యంలో టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతు న్నారు. పార్టీలో విభేదాలు రాకుండా.. కార్య‌క‌ర్త‌ల‌ను స‌మన్వ‌యం చేసుకుని ముందుకు సాగుతున్నారు. జ‌నంలోనే ఉంటూ.. జ‌గ‌న్ స‌ప‌ర్కారు లోపాల‌ను ఆయ‌న ఎండ‌గ‌డుతున్నారు.

ఈ ప‌రిణామాలు.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ ఢీ అంటే ఢీ అనేలా సాగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.