Begin typing your search above and press return to search.
నష్టాల ఎయిర్ లైన్స్ లాభాల్లోకి తెచ్చిన 'బికినీ'
By: Tupaki Desk | 13 April 2017 6:40 AM GMTఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్న ప్రచారం మాట ఇప్పుడు చెప్పే ఉదంతంలో అక్షరాల నిజమని చెప్పాలి. ఒకే ఒక్క ఐడియా.. నష్టాల ఊబిలో కూరకుపోయి..ఊసోరుమంటున్న ఎయిర్‌లైన్స్ దశను.. దిశను మార్చేయటమే కాదు.. ఒక్కదెబ్బకు లాభాల బాట పట్టిన వైనమిది. ఎయిర్ లైన్స్ వ్యాపారంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఏ చిన్న పొరపాటు దొర్లినా.. ఇక అంతే. అలాంటిది నష్టాల బాటలో కూరుకుపోయిన ఎయిర్ లైన్స్ ను లాభాల బాట పట్టించిన ఐడియా ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆశ్చర్యపోవటం ఖాయం.
ఇంతకీ.. ఆ ఎయిర్ లైన్స్ సంస్థ ఏది? నష్టాల నుంచి లాభాల్లోకి ఎలా వచ్చింది? .. ఇంతకీ ఏ ఐడియా ఆ ఎయిర్ లైన్స్ దశను మార్చేసింది? లాంటి వివరాల్లోకి వెళితే.. వియత్నాంకు చెంది వియతజెట్ అనే ఎయిర్ లైన్స్ కంపెనీ ఉంది. దానికి పుట్టెడు నష్టాలు.అందులో నుంచి ఏం చేయాలో తోచని పరిస్థితి. మరి.. ఎలా వచ్చిందో కానీ.. ఆ సంస్థ యజమానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అదేమంటే.. బీచ్‌లకు నడిపే తమ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లలో ఎయిర్ హోస్టెస్ టూపీస్ తో రావొచ్చని.. లేదంటే బికినీ అయినా ఓకే అని సంస్థ యజమాని ఎంఎస్ థావో సెలవిచ్చారు.
ఓనర్ చెప్పిన తర్వాత ఉద్యోగులు మాత్రం ఆగుతారా? వెంటనే బికినీ అవరాత్లో దిగేసిన వారి దెబ్బతో ఎయిర్ లైన్స్ దశ తిరిగిపోయింది. వాస్తవానికి ఈ ఐడియావిన్నవారు.. ఎయిర్ లైన్స్ మీద బ్యాడ్ ఇమేజ్ వస్తుందని అనుకున్నారట. కానీ.. అందుకు భిన్నంగా.. భారీ లాభాలు వచ్చాయట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎయిర్ హోస్టెస్ కు బికినీలు వేయించటం వియతజెట్‌కు కొత్తేం కాదట. 2012లో విమానంలో బికినీ షో చేయించి.. ఫ్యాషన్ షూట్ చేయించారు. అయితే.. ఈ ఇష్యూ మీద విమాన సంస్థల బోర్డు 2012లో జరిమానా విధించింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజా బికినీ ఐడియాతో ఇప్పుడా ఎయిర్ లైన్స్ ను ముద్దుగా బికినీ ఎయిర్ లైన్స్ అని పిలుస్తున్నారట. మరి.. తాజా వ్యవహారంపై విమానసంస్థల బోర్డు ఎలా రియాక్ట్ అవుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/