Begin typing your search above and press return to search.
అమ్మకానికి గోల్డెన్ హోటల్ లోని ఫ్లాట్లు.. ధర ఎందంటే?
By: Tupaki Desk | 12 July 2020 12:30 AM GMTప్రపంచంలో వింతలకు..విశేషాలకు కొదవలేదు. దారుణమైన పేదరికం ఒకపక్కన.. అంతులేని ఐశ్వర్యం మరో పక్కన చాలా దేశాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. అందుకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని పరిస్థితులే ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పే హోటల్ అలాంటి ఇలాంటిది కాదు. హోటల్ లోని గోడలు మొదలుకొని.. అది ఇది అన్న తేడా లేకుండా మొత్తం బంగారమే. ప్రపంచంలోని పూర్తిస్థాయి గోల్డెన్ హోటల్ గా అభివర్ణిస్తున్న ఈ స్వర్ణ హోటల్ ఎక్కడ ఉందంటారా? అక్కడికే వస్తున్నాం.
వియత్నాంలో నిర్మిస్తున్న ఈ హోటల్ చివరి దశకు వచ్చేసింది. చాలా రోజులుగా జరుగుతున్న పనులు పూర్తి కావొస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్ నిర్మాణం 2009లో మొదలైంది. అప్పటి నుంచి దీని పనులు దశల వారీగా చేసుకొస్తున్నారు. ఈఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెబతున్నారు. ఈ ఫైవ్ స్టార్ హోటల్ ను ఏ మూలన చూసినా బంగారమే కనిపిస్తుంది. హోటల్ లోపల మాత్రమే కాదు.. బయట కూడా బంగారం తాపడం చేయటం దీని ప్రత్యేకతగా చెప్పాలి.
హోటల్ లాబీ మొదలుకొని.. ఎలివేటరు... ఫర్నీచర్.. చివరకు చేతులు కడుక్కునే వాష్ బేసిన్ మొదలు.. బాత్ టబ్ ఇలా ఒకటేమిటి? ఏదైనా బంగారమే. చివరకు హోటల్ వెలుపల గోడకు సైతం బంగారాన్నే తాపడటం చేశారు. ఇందులో ఒక రోజు ఉండాలంటే మన రూపాయిల్లో రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ధర మన వరకు చాలా తక్కువే. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో రూంలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.
25 అంతస్తులు ఉండే ఈ ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన డీల్ బయటకు వచ్చింది. ఇందులో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. అలా అని దాన్ని కొనేసి.. ఉండిపోదామంటే కుదరదు. ఫ్లాట్ కొనొచ్చు. దాన్ని రోజుల వారీగా అద్దెకు ఇవ్వాలే కానీ.. పర్మినెంట్ గా ఉండేందుకు అనుమతించారు. ఫ్లాట్ కొన్న యజమాని.. దాన్ని అద్దెకు ఇచ్చేందుకు హోటల్ పేర్కొన్న ఏజెన్సీతో డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ హోటల్ ను నిర్మిస్తున్నది ఎవరంటే.. హోవా బిన్ గ్రూపు సంస్థ. ఈ గోల్డెన్ హోటల్ లో ఫ్లాట్ కొనాలనుకున్న వారికి.. చదరపు మీటరు రూ.4.9 లక్షలుగా డిసైడ్ చేశారు. అంటే.. ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కోట్లల్లో ఖర్చు చేయాల్సిందే. మరి.. దీన్లో ఫ్లాట్ ఎంతమంది భారతీయులు సొంతం చేసుకుంటారో చూడాలి?