Begin typing your search above and press return to search.
కరోనాపై పోరులో అమెరికా కన్నా వియత్నాం భేష్..ఎందుకంటే?
By: Tupaki Desk | 18 Jan 2021 5:30 PM GMTకరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలైన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడంలో అగ్రరాజ్యం అమెరికా విఫలమైంది. 32 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 4 లక్షల మంది కరోనాబారిన పడి మరణించారు. కానీ, 9 కోట్ల జనాభా ఉన్న వియత్నాంలో కోవిడ్ మరణాలు 35 మాత్రమే. కరోనా తరహా వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల జాబితా-2019లో అమెరికా, బ్రిటన్‌లు ముందున్నాయి. ఆ జాబితాలో న్యూజీలాండ్, చైనా, వియత్నాం చాలా వెనుకపడ్డాయి. అయినా కూడా యూఎస్ఏ కన్నా వియత్నాం..కరోనా మరణాలలో వెనుకబడి ఉంది. న్యూజీలాండ్ కూడా మెరుగ్గా వైరస్‌కు కళ్లెం వేయగలిగింది. దీనికి రకరకాల కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు స్పందించిన తీరు కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వమా? సమాఖ్య వ్యవస్థ, అధ్యక్ష వ్యవస్థ? అనేది ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య సేవలు, ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వ విధానం, ఆసుపత్రుల సామర్థ్యం తదితర అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అమెరికాలో ట్రంప్ విధానాల వలనే కరోనా విలయతాండవం చేసింది. చైనా అనుసరించిన నిరంకుశ విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది.
వియత్నాం కూడా కచ్చితమైన విధివిధానాలతో కరోనాను నియంత్రించిందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షలు, ప్రభుత్వ విధానాలు, కరోనా మరణాలను గణించిన తీరు భిన్నంగా ఉండడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. కరోనాపై ఆలస్యంగా స్పందించిన దేశాలలో కేసులు, మరణాలు పెరిగాయని చెబుతున్నారు.