Begin typing your search above and press return to search.
మహాద్వారం ఎదుట పోలీసుల ముష్టియుద్ధం
By: Tupaki Desk | 18 Oct 2015 7:43 AM GMTపరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట పోలీసులు తన్నుకున్నారు. ఇద్దరు పోలీసుల మద్యసాగిన కోట్లాట తీవ్ర రూపం దాల్చటమే కాదు.. రక్తం వచ్చేలా కొట్టుకోవటం సంచలనం సృష్టించింది.
స్వామివారి ఆలయంలోకి ఆయుధంతో లోపలికి అనుమతించారు. అయితే.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శివానంద అనే సెక్యూరిటీ గార్డు.. ఆయుధంతో గుడి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని సెక్యూరిటీ గార్డు బాలాజీ అడ్డుకున్నారు. దీంతో.. ఇరువురు మధ్య మాటా మాటా పెరిగింది. మాటలు తీవ్రస్థాయికి వెళ్లి ఇద్దరు కలయబడిన దుస్థితి.
మోహినీ రూపంలో స్వామివారి ఊరేగింపు ముగిసిన వెంటనే ఈ గొడవ చోటు చేసుకుంది. ఈ కోట్లాటలో శివానంద తలకు గాయమైంది. దీంతో.. స్పందించిన మిగిలిన సిబ్బంది వారిద్దరిని విడదీసి.. గాయాలైన కానిస్టేబుల్ కి చికిత్స జరుపుతున్నారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారులే ముష్టియుద్ధం చేసుకోవటం.. రక్తం వచ్చేలా కొట్టుకోవటంపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనమడు దేవాంశు అన్నప్రాశన మహోత్సవం తిరుమలల జరగనున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పర్యటన పూర్తి అయిన తర్వాత.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారని చెబుతున్నారు.