Begin typing your search above and press return to search.
సాయిబాబా జన్మస్థలాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న విజయ్ చందర్ !
By: Tupaki Desk | 18 Jan 2020 1:30 PM GMTసాయిబాబా ఎక్కడ పుట్టారు ఈ ప్రశ్న మళ్లీ ఇప్పుడు తలెత్తింది. ఇప్పటివరకూ సాయిబాబా జన్మస్థలంగా షిర్డీనే అందరూ చెప్పుకుంటున్నారు. అందుకే అక్కడే ఆలయాన్ని కూడా నిర్మించారు. ఐతే... ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. ఆ ప్రభుత్వం తమ మార్క్ చూపించేందుకు సాయిబాబా జన్మస్థలాన్ని వివాదంలోకి నెట్టింది. సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన పాథ్రీ అని స్థానికులు నమ్ముతూ 1999లో శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడంతో ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ఈమధ్యే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్ స్పందించారు. అసలు ఇప్పటివరకూ శిరీడీ సాయి నాథుడు ఎలా పుట్టారో ఎవరూ కనిపెట్టలేక పోయారన్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి శిరిడీ సాయిబాబా ఆలయం కొనసాగుతోందని.. నిన్నగాక మొన్న వచ్చిన ఈ ప్రభుత్వం ఎలా తొలగించగలదని ప్రశ్నించారు. దయచేసి ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. నిజంగానే ఒక రాత్రిలో శిరిడీ సాయి బాబా జన్మించి ఉంటే ఇప్పటివరకూ ఆ స్థలానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ చందర్.
అయితే , మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన ప్రకటనపై షిర్డీవాసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 19 నుంచి షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. అయితే సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆలయాన్ని మూయడంలేదు అని, అలాగే భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది. అయితే షిరిడీలోని హోటల్స్, ప్రైవేట్ రవాణా మాత్రం ఆదివారం నుంచి బంద్‌ను పాటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై ఇవాళ స్థానికులతో చర్చించనున్న ట్రస్ట్ తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది.