Begin typing your search above and press return to search.
మోడీ బర్త్ డే స్పెషల్: ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే లడ్డూ ఫ్రీ
By: Tupaki Desk | 17 Sep 2019 5:00 AM GMTఈ రోజు స్పెషల్ ఏమిటంటే.. తెలంగాణ విమోచన దినోత్సవమని కొందరు.. కాదు తెలంగాణ విలీన దినోత్సవమని మరికొందరు చెబుతుంటారు. దీనంతటికి మించిన ప్రత్యేకత మరొకటి ఉంది. ఇది తెలంగాణ ప్రాంతానికి మాత్రమే కాదు.. యావత్ దేశానికి సంబంధించింది. అదేనండి.. ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు. తమ ఆరాధ్యమైన అభిమాన నేత 69వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపేందుకు బీజేపీతో పాటు ఆయన్ను అభిమానించేవారు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా మోడీకి నచ్చిన రీతిలో కార్యక్రమాలు చేసేందుకు బీజేపీ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ ను నిషేధించే అంశం మీద గడిచిన కొద్దికాలంగా మోడీ ఆలోచనలకు తగ్గట్లుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లేందుకు బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ ఒక వినూత్న ప్రచారాన్ని సిద్ధం చేశారు. దేశ రాజధాని పాలికా బజార్ లో మంగళవారం ప్రధాని మోదీ 69వ బర్త్ డే. ప్రధాని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు బీజేపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇక ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ శ్రీకారం చుట్టారు. బాటర్ బాటిల్‌లాంటి ప్లాస్టిక్ వస్తువును ఇస్తే లడ్డూని బహుమతిగా ఇచ్చే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
ఏక్ ప్లాస్టిక్ - ఏక్ లడ్డూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఒకసారి వాడిన ప్లాస్టిక్ తో పాటు.. ఏ ప్లాస్టిక్ వస్తువును తీసుకెళ్లి ఇస్తే.. అందుకు బదులుగా ఒక లడ్డూను ఉచితంగా ఇస్తారు. ఇవాళ ఒక్కరోజే వెయ్యి కేజీల లడ్డూల్ని పంచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ ను ఎవరికి వారు విడిచి పెట్టాలన్న ప్రచారంలో భాగంగా తామీ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నిర్వాహఖలు చెబుతున్నారు. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణం దెబ్బ తింటోందని.. దాని కారణంగా తలెత్తే విపరిణామాలు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్నారు విజయ్ గోయెల్.