Begin typing your search above and press return to search.
సీఎం ఎవరో మాల్యాకు ముందే తెలిసింది
By: Tupaki Desk | 14 Dec 2018 5:14 AM GMTఅన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. తీవ్ర కసరత్తు తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం పదవిని ఆశించినప్పటికీ.. కమల్ నాథ్ నే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంపిక చేశారు. అయితే, ఓ వైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే - లిక్కర్ కింగ్ విజయమాల్యా కాంగ్రెస్ తరఫున సీఎం కాబోయేది ఎవరో తేలుస్తూ...చేసిన ఓ ట్వీట్ గందరగోళం - సంచలనం సృష్టించింది.
సీఎం ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి ఒకింత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ గెహ్లాట్ - పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఇద్దరూ సీఎం పదవి కోసం ప్రయత్నించడగా.. మధ్యప్రదేశ్ లో కేంద్ర మాజీ మంత్రి - రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ - యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీపడ్డారు. ఈ నలుగురితో తన నివాసంలో రాహుల్ విడివిడిగా భేటీ అయ్యారు. రెండు రాష్ర్టాల పార్టీ ఇన్ చార్జ్ లు అవినాశ్ పాండే (రాజస్థాన్) - దీపక్ బబారియా (మధ్యప్రదేశ్)లతోపాటు ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్ - ఏకే ఆంటోనీ - ఇతర ముఖ్యనేతలతోనూ రాహుల్ చర్చలు జరిపారు. బుధవారం ఆయా రాష్ర్టాల్లో జరిగిన సీఎల్పీ సమావేశాల నిర్ణయాలను వారు రాహుల్ కు వివరించారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు కూడా ఉన్నందున బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి అనుభవజ్ఞులైన నేతలే సీఎంలుగా ఉండాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇలా కసరత్తు సాగుతున్న దశలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రుల ఎంపికతో సతమతమవుతున్న కాంగ్రెస్ ను మరింత ఇరుకున పెట్టేలా ఈ ట్వీట్ ఉంది. కాంగ్రెస్ యువనేతలు జ్యోతిరాదిత్య సింధియా - సచిన్ పైలట్ లను అభినందిస్తూ మాల్యా గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. యువ విజేతలకు అభినందనలు అంటూ ఆయన చేసిన చిన్న ట్వీట్.. కాంగ్రెస్ లో గందరగోళాన్ని మరింత పెంచింది. ట్వీట్ తోపాటు సచిన్ - జ్యోతిరాదిత్యలను ఆయన ట్యాగ్ చేశారు. అయితే సీనియర్లకే సీఎం బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మాల్యా ట్వీట్ గందరగోళం రేపింది. కాగా, మాల్యా అంచనా విఫలమై మధ్యప్రదేశ్ పీఠం సీనియర్ అయిన కమల్ నాథ్ ను వరించింది.